దసరా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మళయాలీ కుట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వ్యక్తి ఫోటో ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఫిలింనగర్‌లో కీర్తి పెళ్లిపై రకరకాలుగా వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. కీర్తి సురేష్ ఫర్హాన్ బిన్ లియాకత్ ఫోటోను షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ చెప్పింది. మహానటి షేర్ చేసిన ఈ ఫోటో పలు గాసిప్స్‌కు కారణమైంది.

తన లైఫ్‌లో ఓ మిస్టరీ మ్యాన్ ఉన్నాడంటూ గత కొన్నిరోజుల నుంచి వస్తోన్న వార్తలపై తాజాగా నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh) స్పందించింది. అలాంటి వారెవరూ ప్రస్తుతానికి తన జీవితంలో లేరని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ట్వీట్ చేసింది. ‘‘హ్హహ్హహ్హ.. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్‌ను ఈ వార్తల్లోకి లాగారా. (కాబోయే వరుడిని ఉద్దేశిస్తూ) నిజమైన మిస్టరీ మ్యాన్‌ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటివరకూ చిల్‌గా ఉండండి. (వివాహాన్ని ఉద్దేశిస్తూ) ఒక్కసారి కూడా సరైన వార్తలు రాలేదు’’ అని బదులిచ్చింది.

ఇక కీర్తి సురేష్ ప్రొఫెషనల్ కెరీర్‌కు వస్తే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ కొట్టిన హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. దసరా హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న కీర్తి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్‌లో ఆయనకు సోదరిగా నటిస్తోంది. ఇదేకాక పలు ఇతర భాషా చిత్రాలకు కూడా కీర్తి సురేష్ సైన్ చేసింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఎంత వరకు నిజమనేదానిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.