Keerthy Suresh.. ఈ మహానటి సోషల్ మీడియాలో రోజురోజు తన ఫొటోషూట్ తో అభిమానులకు అందాల విందు వడ్డిస్తోంది. తాజాగా కీర్తి చీరకట్టులో అందంగా ముస్తాబైంది. ఇక తన క్యూట్ పోజులతో నెటిజన్లను మైమరిపించింది. అందమైన చిరునవ్వుతో మాయ చేస్తూ మెస్మరైజ్ చేసింది. స్కై బ్లూ కలర్ శారీలో కీర్తి ఫొటోషూట్ అదిరిపోయింది.
ఈ ఫొటోల్లో కీర్తి చాలా క్యూట్ గా కనిపించింది. ఇంకా ఇందులో నాలుక బయట పెట్టి ఎక్కిరిస్తున్నట్టు ఇచ్చిన పోజు మాత్రం భలేగా ఉంది. చేతిలో పూలు పట్టుకుని సిగ్గుపడుతూ దిగిన ఫొటోకు లైకుల మీద లైకులు వచ్చేస్తున్నాయి. చీరకట్టులో భలే ఉన్నావ్ కీర్తి అంటా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కీర్తి సురేశ్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ఈ భామకు మహానటి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కీర్తి ట్యాగ్ లైన్ కూడా మహానటి అయిపోయింది. ఆ సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. ముఖ్యంగా ఒకే కంట నీరు వచ్చే సీన్ లో అచ్చం సావిత్రమ్మను దింపేసింది.
కీర్తి చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కన్నివిడి, రఘు తాత, బేబీ జాన్, రెండు జెళ్ల సీత, రివాల్వర్ రీటా ఉన్నాయి. కీర్తి ప్రసుత్తం కోలీవుడ్ లోనే బిజీగా ఉంది. అయితే తమిళ్ లో తీసిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తోంది. ఇక మహానటితో వచ్చిన ఫేమ్ తో ఈ భామకు బాలీవుడ్ లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. హిందీలో బేబీ జాన్ అనే సినిమాలో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది కీర్తి.