Keerthi Suresh : ఇంకో కోటి ఇస్తే అందుకైనా రెడీ.. మరీ ఇంతలా దిగజారాలా కీర్తి

- Advertisement -

Keerthi Suresh : కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహానటి సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో కీర్తి సురేశ్ కూడా ఒకరు. అతి తక్కువ సమయంలోనే దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మహానటి సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్టుల కూడా అందుకుంది. అందం, టాలెంట్ ఎంతగా ఉన్నా.. ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో కీర్తి బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది. దాంతో పాటు మరో ఆఫర్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అఫిషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అచ్చ తెలుగమ్మాయిగా అనిపించడంతో తెలుగు వారు ఆదరించారు. నేనులోకల్, అజ్ఞాత వాసి లాంటి సినిమాల్లో నటించింది. తెలుగులో కీర్తి చాలా పద్ధతిగా కనిపించిన సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్‌లోకి వెళ్లాక ఈ అమ్మడు స్టైల్ మొత్తం మార్చేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్లలో కూడా నటించడానికి ఓకే అన్నది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే చిత్రంలో నటిస్తుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో ముద్దు సీన్స్ లో కూడా నటిస్తానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే పాపం కీర్తిని దర్శకుడు చాలా బలవతం చేశాడు.. ఆ సీన్ చేయమని అని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తూ ఈ నటి ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. కీర్తి ఏంటీ ఇలా మారిపోయింది. అన్ని రోతపనులే చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here