Chiranjeevi : చిరంజీవిని అతి దారుణంగా అవమానించిన కీర్తి సురేష్..మండిపడుతున్న మెగా ఫ్యాన్స్!

- Advertisement -

Chiranjeevi ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మీద మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పీకల దాకా కోపంతో ఉన్నారు. ఎక్కడ చూసినా ఆమెని ట్యాగ్ చేస్తూ తిడుతూ ఉన్నారు. అందుకు కారణం రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో డ్యాన్స్ పరంగా సరికొత్త మార్పులు, వేగాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి హీరో మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు హీరోలు కూడా డ్యాన్స్ వేసేవారు కానీ, చిరంజీవి స్థాయిలో మాత్రం కాదు. డ్యాన్స్ కి సరికొత్త నిర్వచనం తెలిపిన ఏకైక హీరో ఆయన. ఇప్పటి హీరోలు వేస్తున్న అతి కష్టమైన డ్యాన్స్ మూవ్మెంట్స్ మెగాస్టార్ చిరంజీవి మూడు దశాబ్దాల క్రితమే ఆడియన్స్ కి రుచి చూపించారు.

Chiranjeevi
Chiranjeevi

అప్పట్లో హీరోలు డ్యాన్స్ వేస్తే, వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారా, ఫైట్ చేస్తున్నారా అని అయ్యోమయానికి గురి అయ్యేవారు ఆడియన్స్, అంత కామెడీ గా అనిపించేది. చిరంజీవి వచ్చాక అవి మారాయి. అందుకే ఆయనకీ అంత రేంజ్ లో క్రేజ్ వచ్చింది. అయితే చిరంజీవి కంటే ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ గొప్ప డ్యాన్సర్ అంటూ రీసెంట్ గా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం పెద్ద వివాదానికి దారి తీసింది. చిరంజీవి మరియు విజయ్ లలో మీకు ఎవరి డ్యాన్స్ బాగా నచ్చుతుంది అని ఆమెని యాంకర్ అడగగా, దానికి క్షణం కూడా ఆలోచించకుండా ఆమె విజయ్ పేరు చెప్పేసింది.

Chiranjeevi announces new film 'Bholaa Shankar' on birthday; co-star Keerthy Suresh shares adorable wish – India TV

- Advertisement -

చిరంజీవి సినిమాల్లోని స్టెప్పులను కాపీ కొట్టే విజయ్ ఎక్కడా?, డ్యాన్స్ కి సరికొత్త నిర్వచనం తెలిపిన చిరంజీవి ఎక్కడ?, కీర్తి సురేష్ ఎందుకు ఇలా చెప్పింది అంటూ చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే కీర్తి సురేష్ అనేక సందర్భాలలో తన అభిమాన నటుడు ఎవరు అని అడిగితే, ఆమె విజయ్ పేరునే చెప్తూ వచ్చేది. ఒకానొక దశలో తమిళ మీడియా వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. విజయ్ అంటే ఆమెకి అంత ఇష్టం కాబట్టే, ఆమె అలా తన పేరు చెప్పి ఉండొచ్చు కానీ, మెగాస్టార్ కి విజయ్ డ్యాన్స్ పరంగా అసలు పోటీనే కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కీర్తి సురేష్ కి అకస్మాత్తుగా నెగటివిటీ బాగా పెరిగిపోయింది కాబట్టి దీని గురించి ఆమె వివరణ ఇస్తుందో లేదో చూడాలి.

Keerthy Suresh opens on her Relationship with Vijay

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here