మహా నటి కీర్తి సురేష్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే నిత్యం సినిమాలతో హెడ్‌లైన్స్‌లో నిలిచే కీర్తి సురేష్ ఈసారి మాత్రం వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లోకెక్కింది. కీర్తి సురేష్ ఓ అబ్బాయితో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే సదరు వ్యక్తితో పెళ్లి పీటలెక్కనుందనేది సదరు వార్త సారాంశం. అందులోనూ కీర్తి సురేష్ ఓ అబ్బాయితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. అందులోనూ ఇద్దరూ ఒకే కలర్ డ్రస్ ధరించడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.
మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చి చెప్పారు. తాజాగా, ఈ పుకార్లపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కూడా స్పందించారు. ఈ మేరకు కేరళ బీజీపీ నాయకురాలు శోభ సురేంద్రన్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ఈ విధంగా చెప్పుకొచ్చారు. ‘‘నా కూతురు కీర్తి ఓ అబ్బాయితో లవ్‌లో ఉందని.. త్వరలో అతడ్ని పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. నా ఆ అబ్బాయి తెలుసు. అతడి పేరు ఫర్హాన్.
ఫర్హాన్ పుట్టినరోజున, కీర్తి సురేష్ కొన్ని ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేసింది. వాటిని ఒక తమిళ ఆన్‌లైన్ మ్యాగజైన్ సేకరించింది. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే మీడియాకు, ప్రజలకు ముందుగా తెలియజేస్తాము. సోషల్ మీడియాలో అసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ చేయడం కారణంగా కుటుంబంలో మనఃశాంతి కరువవుతుందని’ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలో కీర్తి సురేష్ కూడా స్పష్టనిచ్చిన విషయం తెలిసిందే. నెట్టింట వైరల్ అవుతోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఫొటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.