Keerthy Suresh : ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో కీర్తి సురేశ్.. బోల్డ్ ఔట్ ఫిట్ లో గ్లామర్ ట్రీట్

- Advertisement -

Keerthy Suresh : మహానటి కీర్తి సురేశ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన ఈ భామ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. మహానటి చిత్రంతో ఒక్కసారిగా కీర్తి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ బ్యూటీ అందానికే కాదు అభినయానికీ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ భామ తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఇక తాజాగా బాలీవుడ్​లోనూ ఎంట్రీకి రెడీ అయింది. బీ టౌన్​లో ఈ భామ బేబీ జాన్ చిత్రంతో ఇంట్రడ్యూస్ అవుతోంది.

Keerthy Suresh
Keerthy Suresh

ఇక సోషల్ మీడియాలోనూ కీర్తి సురేశ్ హవా మామూలుగా లేదు. ఒకప్పుడు ట్రెడిషనల్ వేర్​లోనే కనిపించిన కీర్తి.. ఈ మధ్య వెస్టర్న్ వేర్​లోనూ తన సోయగం చూపిస్తోంది. కొన్నిసార్లు బోల్డ్​లుక్​లో కనిపించి ఫ్యాన్స్​ను షాక్​కు గురి చేస్తోంది. తాజాగా కీర్తి వైట్ కలర్ డ్రెస్సులో అదరగొట్టింది.వైట్ ఔట్ ఫిట్ లో ఏంజెల్ ను తలపించింది. 69ల ఫిల్మ్ ఫేర్ వేడుకలకు ఈ డ్రెస్సులో హాజరైంది. ఈ భామకు దసరా సినిమాకు గానూ ఉత్తమ నటి పురస్కారం లభించింది. అదే సినిమాలో కీర్తికి జంటగా నటించిన హీరో నానికి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఈ ఈవెంట్ లో కీర్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Keerthy suresh 69th Filmfare Awards South 2024 | Starwood Updates #keerthysuresh - YouTube

- Advertisement -

ట్రెండీ ఔట్ ఫిట్ లో కాస్త బోల్డ్ లుక్ యాడ్ చేసి గ్లామరస్ గా కనిపించింది. కీర్తి లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంతందంగా ఉన్నావే అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. మొత్తానికి కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.

ఇక కీర్తి సురేశ్ సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ భామ చేతిలో బేబీ జాన్ బాలీవుడ్ మూవీ, రివాల్వర్ రీటా, కన్నివెడి, రఘు తాత, వంటి చిత్రాలు ఇన్నాయి. ఇక ఇటీవలే రిలీజ్ అయిన కల్కి సినిమాలో భైరవ ఫేవరెట్ బుజ్జి పాత్రకు కీర్తి సురేశ్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో బుజ్జికి సూపర్ క్రేజ్ ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here