Keerthy Suresh : బోల్డ్ బ్యూటీతో కీర్తి సురేశ్.. ఇంతకి దిగజారిందేంట్రా బాబు అంటున్న నెటిజన్లు

- Advertisement -


Keerthy Suresh గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రామ్ సరసన ‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పటికే పలువురు నటీనటులు ఓటీటీలో అడుగు పెట్టారు. కీర్తి సురేష్ తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌‎లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్‎కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Keerthy Suresh
Keerthy Suresh

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. ధర్మరాజ్ శెట్టి డైరెక్షన్లో ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో సిరీస్‎ను నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‎కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. గత ఆర్నెళ్లుగా ఈ వెబ్ సిరీస్ కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం మొదలుకానుంది. పీరియాడిక్ థ్రిల్లర్‎గా ఈ సిరీస్ రూపొందనున్నట్లు టాక్. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రత్యర్థులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Keerthi suresh Dazzling looks on netflix event

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు తెలియరాకుండా నిర్మాణ సంస్థ జాగ్రత్తపడుతోంది. ఈ సిరీస్ షూటింగ్ దాదాపు 75 శాతానికి పైగా పూర్తి అయిన తర్వాతే అఫీషియల్ ప్రకటనలు చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే తప్ప మిగతా నటీనటుల వివరాలేవీ తెలియరాలేదు. కీర్తి సురేశ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. వీడీ18 అనే వర్కింగ్ టైటిల్ లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ‘కన్నివెడి’, ‘రివాల్వర్ రీటా’, ‘రఘు తాత’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com