Keerthi suresh : ఆయన పుల్ల పెట్టకుండా ఉన్నట్లైతే ఎప్పుడో కీర్తి సురేష్.. నాగ చైతన్య భార్య అయ్యుండేది

- Advertisement -


Keerthi suresh : కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహా నటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుని భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఒకప్పుడు మహానటి అంటే జనాలకు సావిత్రి ఎలా గుర్తొచ్చేవారో.. ఈ తరం మహానటి అంటే మాత్రం ఠక్కున్న గుర్తుకు వచ్చేది కీర్తి సురేష్. సినిమాల్లో అలాంటి అద్భుతమైన నటనను కనుబరుస్తుంది ఈ ముద్దుగుమ్మ. కీర్తి సురేష్ చూస్ చేసుకునే పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆమెను ప్రేక్షకులు ఇష్టపడుతారు.

Keerthi suresh
Keerthi suresh

ఇటు నాగ చైతన్య కూడా వెరైటీ కథలను ఎంచుకుంటూ హిట్స్ కొడుతూ కెరీర్ బాగానే కొనసాగిస్తున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత దృష్టంతా కెరీర్ మీదనే ఫోకస్ చేసి వరుసగా సినిమాలు చేస్తున్నారు నాగ చైతన్య. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా మిస్ అయింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నాగచైతన్య కు భార్యగా నటించాల్సి ఉంది. కానీ ఆ ప్లేస్ లోకి సమంత వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు మజిలీ. సమంత, నాగచైతన్య, దివ్యాంక కౌశిక్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది.

keerthy suresh
keerthy suresh

ఈ సినిమాలో సమంత పాత్ర కోసం ముందుగా కీర్తి సురేష్ ను అనుకున్నారట డైరెక్టర్ శివనిర్వాణ. అయితే ఆ పాత్ర కోసం ఎవరినో ఎంచుకోవడం కంటే రియల్ వైఫ్ అయిన సమంతనే తీసుకుంటే సినిమాకి హైలైట్ అవుతుందంటూ శివ నిర్వాణకు సజెషన్ ఇచ్చారట ఓ హీరో. ఆయన మరెవరో కాదు అఖిల్ అక్కినేని. దీంతో ఆఖరి క్షణాల్లో కీర్తి సురేష్‏ని తీసేసి సమంతని పెట్టుకున్నాడు శివ నిర్వాణ. అలా వాళ్ల కాంబో మిస్ అయిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here