Raviteja : రవితేజ మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ ‘ఈగల్’ విశేషాలు మీడియా సమావేశంలో పంచుకున్నారు.

‘‘ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించి తప్పకుండా సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ సినిమా చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. ఈగల్ లో యాక్షన్, రొమాన్స్ వేటికవే చాలా యూనిక్ గా వుంటాయి. రొమాన్స్ అయితే చాలా డిఫరెంట్ గా, కొత్తగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తా, ఇందులో చాలా అద్భుతమైన ప్రేమ కథ వుంది.

దాని గురించి ఇప్పుడు ఎక్కువ రివిల్ చేయకూడదు. రవితేజ, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్ గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది, ఈగల్ పై రవితేజ, డైరెక్టర్ కార్తీక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులను చాలా గొప్పగా అలరిస్తుంది. రవితేజతో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సెట్స్ లో చాలా సరదాగా, సపోర్ట్ గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం మరిచిపోలేని అనుభూతి’’ అని చెప్పింది.