Karthikeya : యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రస్తుతం ‘భజే వాయు వేగం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫుల్ యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ‘భజే వాయు వేగం’ చిత్రం మే 31న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ మేరకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ హీరో శర్వానంద్ హాజరయ్యారు. ఆయన అయ్యప్ప మాలలో వేసుకుని.. ఈవెంట్‌కు ఎంట్రీ ఇవ్వడంతో శర్వానంద్ కాళ్లకు మొక్కాడు కార్తికేయ. అలాగే స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత మరోసారి కార్తికేయ కాళ్లకు దండం పెట్టాడు. అప్పుడు శర్వానంద్ స్వామి శరణమంటూ తన మాలను పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇద్దరు హీరోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ ఆల్‌రౌండర్.. యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్ని జానర్స్ చేయగల నటుడు. తను తప్పకుండా సూపర్‌స్టార్ అవుతాడు’ అని వెలిబుచ్చారు. ఈ సినిమాకు ప్రశాంత్ నిజమైన హీరో. తనెప్పుడు మాస్ మాస్ అని కలవరిస్తాడు. ఆ తరహా కథలే రాస్తాడు. తను ‘రన్ రాజా రన్’ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. అప్పుడే అనుకున్నా ఇతను పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మకం వెలిబుచ్చాడు. ఈ చిత్రానికి సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ పొందింది. నేడు(శుక్రవారం) సినిమా రిలీజ్ కానుంది.