Kannappa : మంచు విష్ణు టైటిల్ హీరోగా నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. మహా శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు సినిమా పై అంచనాలను అమాంతం పెంచుతున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అవడంతో కన్నప్ప టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

ఇందులో భాగంగానే తాజాగా ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది కన్నప్ప టీమ్. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండియా నుంచి ఐశ్వర్యా రాయ్, శోభిత ధూళిపాళ, ఊర్వశి రౌతేలాతోపాటుగా పలువురు పాల్గొన్నారు. ఇక తెలుగు సినిమా నుంచి మంచు విష్ణు ఫ్యామిలీ రెడ్ కార్పెట్ పై నడిచి చరిత్ర సృష్టించారు. ‘ హారిజన్: యాన్ అమెరికన్ సాగా ‘ మూవీ స్క్రీనింగ్ కు ప్రభుదేవాతో కలిసి మోహన్ బాబు, మంచు విష్ణు దంపతులు ఇదే విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇదే స్టేజిపై కన్నప్ప టీజర్ కూడా విడుదల చేయనున్నారు. కాగా దీనిపై మీమర్స్ రియాక్ట్ అయ్యారు. ఇంతటి అరుదైన అవకాశం సొంతం చేసుకున్న మంచు విష్ణుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రోల్ చేస్తూ తాము ఇక్కడే ఉండిపోతే.. ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచి చరిత్ర సృష్టించాడని పొగిడేస్తున్నారు.
Walked the Red Carpet yesterday for the screening of ‘Horizon: An American Saga’@themohanbabu @pddancing @vinimanchu#cannes2024 pic.twitter.com/UcC8OPvFh1
— Vishnu Manchu (@iVishnuManchu) May 20, 2024