Kangana Ranauth : సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఎంత పాజిటివ్ రివ్యూలు వచ్చాయో.. అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. సందీప్ కావాలనే తన సినిమాల్లో ఆడవారిని హింసిస్తూ చూపిస్తాడని, తన డైలాగులు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని.. ఇలా చాలామంది ప్రేక్షకులు ఈ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ మూవీ విడుదలయ్యి ఇన్ని రోజులు అయినా కంగనా మాత్రం దీనిపై స్పందిచంలేదు.

తాజాగా ‘యానిమల్’ను చూసిన కంగనా.. తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా బయటపెట్టింది. సినిమాల్లో హింసను చూపించడానికి కారణం ఆడియన్సే అని ఆరోపించింది. ‘‘నా సినిమాలకు పెయిడ్ నెగిటివిటీని అందించడమే పెద్ద విషయం అని భావిస్తుంటే.. ఆడవారిని కొట్టి, హింసించి, వారిని సె* ఆబ్జెక్ట్స్‌లాగా భావించి, వారితో షూ నాకమని అడిగే సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహించడం మరో ఎత్తు. రానున్న రోజుల్లో కెరీర్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సినిమాల్లో కనిపిస్తోన్న ట్రెండ్ భయంకరంగా ఉంది. నేను సినీ రంగంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ఇలానే ఉండేది. దానిని మార్చాలని మహిళలకు ప్రాధాన్యమున్న సినిమాలను చేశాను. అగ్ర నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలను, స్టార్ హీరోలు నటించిన వాటిని కూడా తప్పుపడుతూ పోరాడాను.

వాళ్లమీద నాకు వ్యక్తిగతంగా కోపం లేనప్పటికీ వాళ్లు ఎంచుకున్న చిత్రాల్లోని కథల వల్ల వ్యతిరేకించాను. నేడు సినిమాల్లో మహిళలకు ఇచ్చే గౌరవం చూస్తుంటే ఎంతో బాధేస్తోంది. దీనికి సినీ పరిశ్రమ మాత్రమే కారణంకాదు.. ఇందులో ప్రేక్షకుల పాత్ర కూడా ఉంది. మహిళలను కించపరిచే సినిమాలను వాళ్లు కూడా ప్రోత్సాహిస్తున్నారు. దానికి ఇటీవల విడుదలైన ఓ చిత్రమే ఉదాహరణ. స్త్రీల కోసం జీవితాలను అంకితం చేసిన వారిని ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తోంది. ఇలాంటి వాటి వల్ల నా కెరీర్‌ను మార్చుకోవాలనుకుంటున్నా’’అని పేర్కొన్నారు. త్వరలోనే వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. రాజకీయాలు తన దృష్టిలో వ్యాపారం కాదని అది ప్రజాసేవ అని పేర్కొన్నారు.