Kangana Ranauth : ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్న కంగనాకి ‘తేజస్’ మూవీ మంచి కం బ్యాక్ ఇస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని తెలిపింది. దాంతోపాటు గతంలో బ్రేకప్ అయిన తన రిలేషన్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా పెళ్లి గురించి మాట్లాడుతూ..

” ప్రతి అమ్మాయి తన పెళ్లి కుటుంబం గురించి కలలు కంటుంది. నేను కుటుంబ వ్యవస్థను ఎంతో గౌరవిస్తాను. పెళ్లి చేసుకుని నాకంటూ ఒక కుటుంబం ఉండాలని కోరుకుంటాను. ఇదంతా రానున్న ఐదేళ్లలో జరుగుతుంది. అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితే బాగుంటుంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత తన గత రిలేషన్స్ గురించి మాట్లాడుతూ..” రిలేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయని అనుకోకూడదు. రిలేషన్ షిప్స్ లో అందరూ సక్సెస్ అవ్వలేరు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో ఫెయిల్ అయ్యాను. దానివల్ల నాకు ఒక విధంగా మంచే జరిగింది. నేను ప్రేమలో ఉన్నట్లయితే నా సమయం అంతా దానికే కేటాయించాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు ఆ బంధం నిలవలేదు. దేవుడు నన్ను రక్షించాడు. ప్రేమ విఫలమవడం వల్ల జరిగే ప్రయోజనాన్ని చాలామంది జీవితంలో చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు” అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది కంగనా రనౌత్.

దీంతో కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి కంగనా చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే మ్యారేజ్ విషయంలో కంగనాకి ఓ క్లారిటీ ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇక ‘తేజస్’ విషయానికొస్తే.. ఈ సినిమాలో కంగనా భారతీయ వాయుసేన పైలట్ గా కనిపించనుంది. 2016లో భారత వైమానిక దళం మొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది.