Kangana Ranaut : దర్శకుడు సందీప్ వంగా యానిమల్‌తో హిట్ కొట్టి బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే ఆయనపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే.. సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను అందించిన సందీప్ సినిమాల్లో నటించేందుకు హీరో, హీరోయిన్లంతా క్యూ కడుతున్నారు. ఈ సమయంలో కంగనా మాత్రం తనకు సందీప్ తన సినిమాలో ఎలాంటి పాత్ర మాత్రం ఇవ్వొద్దని కోరుతూ ట్వీట్ చేసింది.

ఎందుకంటే ఇటీవలే సందీప్ వంగా ఓ ఇంటర్వ్యూలో.. కంగనాతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పగా, ఆ వీడియోను ఎవరో ట్వీట్ చేయగా, కంగనా స్పందిస్తూ, ‘సమీక్ష, విమర్శ ఒకేలా ఉండవు, ప్రతి కళను సమీక్షించుకొని.. చర్చించుకోవాలి.

అది సాధారణ విషయం. . కానీ నా సమీక్షకి సందీప్ వంగా నవ్వుతూ స్పందించిన తీరు చాలా హుందాగా ఉంది.. అతని ప్రవర్తనలాగే ఉంది, అందుకు ధన్యవాదాలు. కానీ మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి, అలా చేస్తే మీ సినిమాల్లోని ఆల్ఫా మేల్ హీరోలందరూ ఫెమినిస్టులు అవుతారు, మీ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి. మీరు బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలి, ఇండస్ట్రీకి మీరు కావాలి అంటూ కంగనా ట్విట్టర్ లో వ్యాఖ్యానించడం ఇప్పుడు వైరల్ గా మారింది.