ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో నటన అంటే మన అందరికీ గుర్తు వచ్చే పేరు కమల్ హాసన్. ఎవరైనా అద్భుతంగా నటిస్తే కమల్ హాసన్ తో పోల్చి చూస్తారు. నటన పరంగా ఆయన నిర్మించుకున్న కోట అలాంటిది. ఆయన చెయ్యలేని పాత్ర ఈ ప్రపంచం లోనే ఉండదు.అలాంటి మహానటుడు ఆయన, అయితే ప్రతీ గొప్ప మనిషికి ఎదో ఒక వ్యసనం ,లేదా చెడు లక్షణాలు ఉంటాయి, అది సర్వసాధరమైన విషయం.

కమల్ హాసన్ కి కూడా అలాంటి అలవాటు ఉంది. ఆయనకీ అమ్మాయిలు అంటే పిచ్చి, ఎవ్వరినీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు.కేవలం కొంతకాలం డేటింగ్ చేశామా, ఆ తర్వాత వదిలేశామా అనే రకం. వయస్సు తో కూడా సంబంధం లేకుండా కమల్ హాసన్ ఎంతో మందితో డేటింగ్ చేసాడు. అందుకే వ్యక్తిగతంగా కమల్ హాసన్ కి మంచి పేరు లేదు, నటన పరంగా ఆయనని ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ, వ్యక్తిగతంగా మాత్రం ఇలా ఉండకూడదు అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తాడు ఆయన.

కెరీర్ ప్రారంభం హీరో గా గుర్తింపు తెచ్చుకుంటున్న రోజుల్లోనే నటి శ్రీ విద్య తో కొన్నాళ్ళు డేటింగ్ చేసి వదిలేసాడు. ఆ తర్వాత శ్రీప్రియ మరియు శ్రీదేవి వంటి హీరోయిన్స్ తో కూడా ఆయన డేటింగ్ చేసి బోర్ కొట్టిన తర్వాత వదిలేసినా సందర్భాలు ఉన్నాయి. ఇదంతా గమనించిన కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్, పెళ్లి తర్వాత అయినా కుదుటగా ఒక అమ్మాయితో జీవితం గడుపుతాడని, క్లాసికల్ డ్యాన్సార్ అయినా వాణీ గణపతి కి ఇచ్చి పెళ్లి చేసాడు.

ఈ పెళ్లి జరిగిన తర్వాత ఆమె తో పదేళ్ల పాటు సంసారం చేసాడు. ఇక లైన్ లో పడ్డాడు, పద్దతి గా ఉన్నాడు అని అనుకునేలోపే తన సహా నటి శారికా మీద మనసుపడ్డాడు. ఆమెతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి, డేటింగ్ చేసి శృతి హాసన్ మరియు అక్షర హాసన్ ని కన్నాడు. పిల్లలు ఉన్నారు నన్ను వదిలేయకు అంటూ శారికా బ్రతిమిలాడినా, నేను ముందే చెప్పాను పెళ్లి చేసుకోను అని, మళ్ళీ అడుగుతావేం అంటూ ఆమెని కూడా దూరం పెట్టేసాడు.

ఇక ఆ తర్వాత గౌతమీ, సిమ్రాన్ వంటి వారితో కూడా కొన్నాళ్ళు డేటింగ్ చేసాడు. ఇప్పుడు ఆయనకీ వయస్సు 60 ఏళ్ళు దాటింది. ఈ వయస్సు లో కూడా ఆయన కుర్ర అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నాడు. తనతో కలిసి విశ్వరూపం వంటి చిత్రం లో నటించిన పూజ కుమార్ తో ప్రస్తుతం ఆయన డేటింగ్ లో ఉన్నాడు. ఈమెకి ముందు ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆండ్రియా జరేమియా తో కూడా డేటింగ్ చేసాడు. ఇప్పుడు ప్రస్తుతం పూజ కుమార్ తో ఆయన ఎన్ని రోజులు డేటింగ్ చేస్తాడో చూడాలి.అలా నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కమల్ హాసన్, వ్యక్తిగతం గా మాత్రం ఈ విషయం లో పాతాళ లోకం లోకి పడిపోయాడు.ఇంత మందితో ఆయన డేటింగ్ చేసినప్పటికీ, ఒక్క అమ్మాయి కూడా ఇప్పటి వరకు కమల్ హాసన్ నన్ను మోసం చేసాడు అంటూ మీడియా ముందుకు రాలేదు. కమల్ సార్ వాళ్లకి ఏమి మ్యాజిక్ చూపించాడో ఆ దేవుడికే తెలియాలి.
