Kamal Hasan : కమల్ హాసన్ మగాడు కాదు ట్రాన్స్ జెండర్.. సింగర్ సెన్సేషనల్ కామెంట్స్

- Advertisement -

Kamal Hasan : ప్రముఖ సింగర్ ఆర్ జె సుచిత్ర కొన్నాళ్లుగా కోలివుడ్‌కు చెందిన నటీనటులపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ నెట్టింట్లో దుమారం రేపుతోంది. ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ దాంపత్య జీవితంపై, అలాగే తన భర్త కార్తీక్‌ గురించి షాకింగ్‌ విషయాలను ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ధనుష్‌తోపాటు త్రిష, అనిరుధ్ రవిచందర్‌, చిన్మయి వంటివారిపై కూడా ఆమె షాకింగ్ కామెంట్‌ చేసింది. తాజాగా విశ్వనటుడు కమలహాసన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెకు నెటింట్లో పలు ట్రోల్స్ ఎదురౌతున్నాయి.

ఇక ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతూ.. కమల్ హ‌సన్ ట్రాన్స్ జెండర్ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘విశ్వరూపం’ సినిమాలో కమల్‌హ‌సన్ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేటప్పుడు అచ్చం ట్రాన్స్ జెండర్‌లా ముఖకవలికలు ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేస్తాడు. దీంతో మేమంతా ఆశ్చర్యపోయాం. అందులో ఆయన వైట్ కలర్ చుడీదార్ లాంటి డ్రెస్ వేసుకున్నారు. అయితే రియల్ లైఫ్ లోనూ ఆయన అలాంటి దుస్తులే ధరిస్తాడు. దీనిపై మేము రీసెర్చ్ చేశాం. కనుక కమలహాసన్ గురించి ఇలా చెబుతున్నామంటూ ఆమె వివ‌రించింది.

- Advertisement -

ప్రస్తుతం సుచిత్ర చేసిన కామెంట్స్ నెటింట్లో వైరల్ అవ్వడంతో అంత ఆశ్యర్యపోతున్నారు. రకరకాల కామెంట్స్ తో త‌మ డౌట్లను వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆమెను బండ బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. వైట్ చుడీద‌ర్ లాంటీ బ‌ట్టలు వేసుకుంటే ట్రాన్స్ జండ‌రేనా.. స్టైల్ అంటూ మీరు జీన్స్ ష‌ర్ట్ వేసుకుంటే మీరు ట్రాన్స్ జండ‌రా అంటూ మండిప‌డుతున్నారు. సుచిత్ర చాలా మంది సెలబ్రిటీల పర్సనల్‌ ఫోటోలు, వారికి సంబంధించిన షాకింగ్‌ రహస్యాలను బయటపెట్టి పాపులర్‌ అయ్యింది. దీంతో సుచీ లీక్స్ అనేది పెద్ద సంచలనంగా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here