Kamal Haasan : 50 ఏళ్ల క్రితం రజినీకాంత్‌కి ఓ మాటిచ్చాను : కమల్ హాసన్

- Advertisement -

Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ తన ఫ్యాన్స్‌కి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్ ఇస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో కీలకపాత్రలో నటించి ఒక ట్రీట్ ఇచ్చిన కమల్.. త్వరలోనే ఇండియన్ 2తో మరో ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. జులై 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సేనాపతి పాత్రలో కమల్ కనిపించబోతున్నారు. బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. ఇందులో కమల్ యాక్షన్ సీక్వెన్సులు చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కమల్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్‌తో తన బంధం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Kamal Haasan
Kamal Haasan

“మేము ఇద్దరం ఎప్పుడూ కాంపిటేటర్స్‌ కాదు. మా ఇద్దరికీ గురువు (కే బాలచందర్) ఒక్కరే. అయితే మా ఇద్దరి మధ్య పోటీ అయితే ఉంది కానీ ఈర్ష్య, అసూయ లేవు. మా ఇద్దరివీ వేరువేరు దారులు. అలానే ఒకరిపై ఒకరు గుడ్డిగా విమర్శలు చేసుకోకూడదని కూడా మేమిద్దరం మాట తీసుకున్నాం. అదీ కూడా మాకు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఈ మాట ఇచ్చాను.” అంటూ కమల్ హాసన్ చెప్పారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో కమల్-రజినీ లాంటి లెజెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో తాము ఉండటం అదృష్టమంటూ హీరో సిద్దార్థ్ చెప్పారు. చాలా మంది స్టార్స్‌లా మందు, సిగరెట్, పాన్ మసాలా లాంటి యాడ్స్‌ను ఎప్పుడూ ప్రచారం చేయకూడదని రజినీ, కమల్ సార్ కలిసి నిర్ణయం తీసుకున్నారని కూడా సిద్దార్థ్ గుర్తు చేశారు.

- Advertisement -

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజినీకాంత్ గురించి కమల్ చెప్పిన మాటలకి తలైవా ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. ఏది ఏమైనా రజినీ-కమల్ స్నేహం వేరు అంటూ ప్రశంసిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here