Kalyan Ram : నందమూరి ఫ్యామిలీ నుండి మిగతా హీరోలు లాగ కాకుండా తనకి నచ్చిన పద్దతి లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని అలరించడానికి ప్రయత్నం చేసే హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఇతని కెరీర్ లో సక్సెస్ రేట్ తక్కువే, కానీ సక్సెస్ సాధించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ పై మంచి ప్రభావం చూపించాయి. ఆ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు నేడు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇకపోతే రీసెంట్ గా కళ్యాణ్ రామ్ హీరో నటించిన ‘డెవిల్ ‘ చిత్రం విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి ప్రయోగమే చేసాడు కానీ, థ్రిల్లర్ జానర్ సినిమాల్లో ఉండాల్సిన థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం వల్ల ఈ అనుకున్న రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఈ చిత్రం విడుదలై మూడు రోజులు అవ్వగా, ఈ మూడు రోజులకు ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అది అసాధ్యం అని కలెక్షన్స్ ట్రెండ్ ని చూస్తుంటే అర్థం అవుతుంది. కనీసం 12 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చేలా ఉంది. అంటే 50 శాతం రికవరీ అయ్యే అవకాశం కూడా లేదన్నమాట. దీనినే డిజాస్టర్ ఫ్లాప్ అని అంటారు.
అలాంటి డిజాస్టర్ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమాకి సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్టు కళ్యాణ్ రామ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అసలు భారీ నష్టం వచ్చి నిర్మాత బాధపడుతుంటే, కళ్యాణ్ ఇప్పుడు సీక్వెల్ గురించి మాట్లాడడం అంత అవసరమా?, ఈయనకి ఈ సీక్వెల్ పిచ్చి ఇలా పట్టుకుంది ఏంటి?, ప్రతీ సినిమాకి సీక్వెల్ తీస్తా అంటాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ పై విరుచుకుపడుతున్నారు.