Devara : #RRR వంటి సంచలన విజయం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ తో ఎన్టీఆర్ చేస్తున్న రెండవ సినిమా ఇది. హిట్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా, అందులోనూ #RRR చిత్రం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం మీద అంచనాలు భారీ గా ఉండడం సహజం.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు డైరెక్టర్ కొరటాల శివ పని చేస్తున్నాడు. అందులోనూ ఆయన గత చిత్రం ‘ఆచార్య’ భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో కొరటాల కి ఇది అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం గా నిల్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక కొరటాల శివ సినిమాలకు దూరం అయిపోతాడు. ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ తో పాటుగా, కొరటాల శివ స్నేహితుడు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే ఈ సినిమా గురించి ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త అభిమానులను కంగారు పెడుతుంది. ఇప్పటి వరకు ఆరు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కేవలం ఫైట్ సన్నివేశాలను మాత్రమే పూర్తి చేసుకుందట. ఈ ఫైట్ సన్నివేశాలకు అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయిందట. మిగిలిన టాకీ పార్ట్ పూర్తి చెయ్యడానికి డబ్బులు కొరత పడింది. అందుకే ఇంటర్వెల్ వరకు ఉన్న సినిమాని రెండు భాగాలుగా చేసి, రెండు పార్టులుగా తీద్దాం అని కొరటాల అనుకున్నాడట.

అయితే నిర్మాతలు కొత్తవాళ్లు అవ్వడంతో ఫైనాన్స్ సమస్య వచ్చింది. అందుకే ఫైనాన్స్ కోసం మా సినిమాలో ఎలా ఉండబోతుందో అని ఒక చిన్న టీజర్ కట్ ద్వారా చూపించబోతున్నారట. జనవరి మొదటి వారం లో ఈ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ టీజర్ వచ్చే వరకు తదుపరి షెడ్యూల్ మొదలు అవ్వదట. మరి ఈ సినిమాకి ఫైనాన్స్ దొరికి, ముందు అనుకున్న విధంగానే షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 5 న విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.