Kalyan Ram : గత కొంత కాలం గా జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ బాలయ్య బాబు కి దూరంగా ఉంటూ వస్తున్నట్టు సోషల్ మీడియా లో బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. రీసెంట్ గా వీళ్లిద్దరికీ సొంత మామయ్య అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం పై అటు ఎన్టీఆర్ కానీ, ఇటు కళ్యాణ్ రామ్ కానీ నోరు కూడా మెదపకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
అంతే కాకుండా బాలయ్య బాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయం లో పబ్లిక్ గా ‘ఐ డోంట్ కేర్’ అంటూ మీడియా ముందు మాట్లాడడం కూడా పెద్ద దుమారమే రేపింది. అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా కళ్యాణ్ రామ్ తన డెవిల్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన బాలయ్య గురించి అలాగే టీడీపీ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘తెలుగు దేశం పార్టీ కి సపోర్ట్ చెయ్యాలా వద్దా అనేది మా కుటుంబం మొత్తం కూర్చొని మాట్లాడి డిసైడ్ అవుతాము. బాలయ్య బాబు తో నాకు మరియు తారక్ కి దూరం పెరిగింది అని మీడియా లో ఎన్నో కథనాలు చూసాను. కచ్చితంగా మా మధ్య గ్యాప్ అయితే వచ్చింది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను నా సినిమాలతో బిజీ గా ఉన్నాను, తమ్ముడు కూడా అంతే..ఇక బాబాయ్ అయితే ఒక పక్క వరుసగా సినిమాలు చేస్తూ, మరోపక్క రాజకీయాల్లో బిజీ గా ఉంటున్నాడు.
అందుకే మా మధ్య గ్యాప్ పెరిగింది కానీ, విబేధాలు వచ్చి మాత్రం కాదు’ అంటూ కళ్యాణ్ రామ్ సమాధానం ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియా లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ, వీళ్లిద్దరు బాలయ్య చంద్రబాబు కి మాత్రం ఉద్దేశపూర్వకంగానే దూరం గా ఉంటున్నారు అని మాత్రం అభిమానులకు అర్థం అయ్యిందని నెటిజెన్స్ అనుకుంటున్నారు.