టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా Sreeja ఈమధ్య తన వైవాహిక జీవితానికి సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే . ఇకపోతే మొదట్లో తన కుటుంబాన్ని ఎదిరించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతనితో విడాకులు తీసుకొని తండ్రి దగ్గరకు చేరుకున్న ఈమె మళ్లీ తండ్రి సలహా మేరకు అప్పటికే వివాహమై విడాకులు తీసుకున్న కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి గుర్తుగా మరొక పాప జన్మించిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిగా ఉంటున్నారు.
అటు విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చినా సరే ఎవరు స్పందించలేదు.. పైగా అధికారికంగా కూడా ప్రకటించకపోవడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఇంకా కొనసాగుతోందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అటు శ్రీజ, ఇటు కళ్యాణ్ దేవ్ చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరు పెట్టే పోస్టులు నిజంగా వీరిద్దరు విడిపోయారు అన్న అనుమానాలను కలిగిస్తోంది.ఇక వారంలో కేవలం నాలుగు గంటలు మాత్రమే తన కూతురితో గడిపే అవకాశం కళ్యాణ్ దేవ్ కి కోర్టు అనుమతి ఇచ్చింది అని.. దీంతో ఆ వారంలో నాలుగు గంటలు తనకు ఆనందకరమైనవి అని.. కుమార్తెను మిస్ అవుతున్నాను అంటూ కూడా కళ్యాణ్ పోస్ట్ పెడుతున్న విషయం తెలిసిందే.
తాజాగా మరొకసారి తన భార్య శ్రీజను ఉద్దేశించి ఇన్ స్టా స్టేటస్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు కళ్యాణ్ దేవ్. మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాము అంటే మోసం ఎప్పటికీ ఎవరిని ఆశ్చర్యపరచలేదు కానీ నమ్మకం మాత్రమే ఆ పని చేస్తుంది అంటూ కళ్యాణ్ షేర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. మరి ఈయన నమ్మకం, మోసం అంటూ ఎవరిని టార్గెట్ చేసి పోస్ట్ చేశారో తెలియదు కానీ ఇది చూసిన నెటిజన్స్ మాత్రం శ్రీజను ఉద్దేశించి కళ్యాణ్ దేవ్ ఇలా పోస్ట్ చేసి ఉంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు.