Kalyan Dev : మెగాస్టార్ చిన్న అల్లుడు, శ్రీజ భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.. కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వాటిని చూసిన జనాలు ఆయన మరో వివాహం చేసుకున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు..కళ్యాణ్ దేవ్, శ్రీజ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఏడాదికి పైగా వారు డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు. శ్రీజ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించారు. ఆమె తండ్రి చిరంజీవి వద్దే ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్ తన పేరెంట్స్ తో ఉంటున్నారు. విడివిడిగా ఉంటున్నప్పటికీ విడాకులు ప్రకటన చేయలేదు. అయితే శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయారని విశ్వసనీయ సమాచారం.

ఈ మధ్య వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అయ్యాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకరిని ఉద్దేశిస్తూ మరొకరు పరోక్షంగా కామెంట్స్ పోస్ట్ చేశారు. ఒక మనిషిని ఇష్టపడటం కంటే అతన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామన్నది ముఖ్యమైన కళ్యాణ్ దేవ్ కామెంట్ పోస్ట్ చేశాడు. దీనికి కౌంటర్ గా శ్రీజా… ఒకరిని ప్రేమించడం అంటే వాళ్ళని వాళ్ళు అధికంగా ప్రేమించుకునేలా చేయాలి. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా చేసుకోవడం కాదు. ప్రేమను గుర్తించాలి. అంతే కానీ ప్రతి విషయంలో దాన్ని వెతక్కూడదు, అని కామెంట్ చేశారు..

అయితే,ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ మరో వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతుంది. సడన్ గా కళ్యాణ్ దేవ్ పెళ్లి వేడుకలో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిని చూసి కళ్యాణ్ దేవ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని జనాలు భ్రమపడ్డారు. వివరాలు తెలుసుకుంటే అది తన ఫ్రెండ్ మ్యారేజ్ అని తెలిసింది. ఆ వివాహానికి కళ్యాణ్ దేవ్ మిత్రులు అందరూ హాజరై ఎంజాయ్ చేశారు. మ్యారేజ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
కళ్యాణ్ దేవ్ సినిమా పరిశ్రమకు కూడా దూరమైన సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి అల్లుడు హోదాలో కళ్యాణ్ దేవ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. విజేత చిత్రంతో పేక్షకులను పలకరించారు. విజేత మూవీ పర్లేదు అనిపించుకుంది. అనంతరం సూపర్ మచ్చి చిత్రంలో నటించారు. ఇది 2022 సంక్రాంతి కానుకగా విడుదలైంది.. అనుకున్న హిట్ ను ఇవ్వలేదు.. ఇక కిన్నెరసాని సినిమాను చేశారు అది ఓటిటిలో విడుదలయింది.. ఇక ఇప్పుడు ఒక్క సినిమాకు కూడా సైన్ చేసినట్లు లేదు.. ఏది ఏమైనా ఈ ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి..