Rajamouli : అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి. ఆయన ప్రతిభ గురించి ప్రస్తుతం ప్రపంచానికి తెలుసు. దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్లో తనకు ప్లాప్ అన్నదే లేదు. ఒక దాన్ని మించి మరొక సినిమా హిట్ అవుతూ వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. తనతో పాటే తెలుగు సినిమా గొప్పతనాన్ని తీసుకెళ్లారు. అలాంటి స్టాయిన అందిందిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు బాక్సాఫీసుల వద్ద వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. దీంతో రాజమౌళి తదుపరి సినిమాల పై భారీ అంచాలున్నాయి. ఇక భారత్ కు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన ఆస్కార్ సైతం పట్టుకొచ్చారు. అటువంటి దర్శకధీరుడిపై ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మరెవరో కాదు ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జక్కన్న పరువు మొత్తం తీసేశాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో కేవలం ఐదు నుంచి ఎనిమిది శాతంమే సక్సెస్ ఉంటుంది. ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం డైరక్టర్లకు అంత ఈజీ కాదు. రాజమౌళికి కూడా అది అసాధ్యమన్నారు. ఐదేళ్లకు ఒక సినిమా తీస్తే ఫ్లాప్ ఎలా వస్తుంది.. కనీసం ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు తీస్తే హిట్, ఫ్లాప్ అంటే ఏమిటో రాజమౌళికి తెలుస్తుందంటూ వ్యాఖ్యనించారు. ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారితో సినిమాలు తీసుకుంటూ పోతే ఫ్లాప్ రాదని.. కొత్త వాళ్లతో తీసి జనాలను రప్పించినప్పుడే దర్శకుడి ప్రతిభ తెలుస్తుందన్నారు. కళ్యాణ్ కామెంట్స్ నెట్టింట్లో దూమారం రేపుతున్నాయి.