Kalki 2898 AD పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కల్కి.. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ నాగ్ అశ్విన్ చేసిన ఈ ప్రయోగానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమాలో విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.. ఈ సినిమా ఈరోజు విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించింది.. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ కొనుగోలు చేసిందో కూడా తెలిసింది..
ఈ సినిమా రెండు ఓటీటీల్లో విడుదల కాబోతుంది.. హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఇలా నాలుగు భాషల కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసిందట.. అలాగే నెట్‌ఫ్లిక్స్ కూడా రూ. 175 కోట్లు వరకు చెల్లించిందని టాక్.. మొత్తం డిజిటల్ హక్కులు రూ. 375 కోట్లు వరకు డీల్ జరిగిందని తెలుస్తుంది.. భైరవ పాత్రలో ప్రభాస్ నటించాడు..
ఈ సినిమా విషయానికొస్తే… నాగ్ అశ్విన్ ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాడు.. కల్కికి జన్మనిచ్చే తల్లిగా దీపిక పదుకొణె నటించింది. ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ కనిపించారు.. అలాగే సీనియర్ నటి శోభన, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్లు రాజమౌళి, ఆర్జీవి లు కూడా అలా కనిపించి వెళ్లారు.. ఇక పోతే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.. వరల్డ్ వైడ్ చూస్తే దాదాపు రూ. 200 కోట్ల వరకు రాబట్టిందని టాక్..