Kalki : కెరీర్‎లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించిన ప్రభాస్.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Kalki : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ కల్కి సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. సాధారణంగా మనకి ప్రభాస్ అంటే గుర్తుకు వచ్చే రోల్స్.. ఒక మిస్టర్ పర్ఫెక్ట్.. ఒక ఛత్రపతి.. ఒక వర్షం లాంటి సినిమాలే.. మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే డార్లింగులో కూడా తెలియని ఓ కమల్ హాసన్ లాంటి నటుడు దాగున్నాడు అన్న విషయాన్ని గ్రహించి ఒక్కో డైరెక్టర్ ప్రభాస్ లోని ఒక్కో షేడ్ బయటకు తీసుకు వస్తున్నారు. సినిమా హీరోలలో కేవలం మాస్ పాత్రలకే సూట్ అయ్యే బాడీ నేచర్ ఒకరిది .. రొమాంటిక్ పాత్రలకు మాత్రమే సెట్ అయ్యే బాడీ మరొకరిది.. అయితే ఎలాంటి పాత్రలకైనా సరే తన బాడీ సెట్ అవుతుందన్న విషయాన్ని ప్రభాస్ తాజాగానే ప్రూవ్ చేశాడు.

Prabhas
Prabhas

రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత సాఫ్ట్ గా.. ఎమోషనల్‎గా ఉంటుందో సినిమాలో చూశాం. అదే విధంగా పౌర్ణమి సినిమాలో చాలా సెంటిమెంటల్ ఫెలో అయిన పాత్రలో కనిపిస్తాడు. ఇక బుజ్జిగాడు సినిమా విషయానికి వస్తే మాత్రం టూ నాటీ గా అదరగొట్టేశాడు. డార్లింగ్ డార్లింగ్ అంటూ తనదైన మాస్ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆయన నటించిన సినిమాల్లో బాగా ఎంటర్ టైన్ చేసే సినిమా ఏదని అంటే మాత్రం కచ్చితంగా బుజ్జిగాడు సినిమా అనే చెబుతారు ఆయన అభిమానులు. ఆ సినిమాలో ప్రభాస్ ఓ రేంజ్ లో కామెడీని పండించాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే క్యారెక్టర్.. ఇంకా పక్కాగా చెప్పాలంటే కూసింత ఎక్కువ రేంజ్ లోనే నాగ అశ్విన్ ప్రభాస్ చేత కామెడీ పండించాడు.

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కల్కి. ఈ చిత్రం కొద్దిసేపటి క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు జనాల నుంచి అద్భుతమైన టాక్ వస్తుంది. చూస్తున్నంత సేపు ఫ్యూజులు ఎగిరిపోయాయని అంటున్నారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో బాహుబలి సినిమానే తోపు అనుకున్నకున్న వాళ్లకు కాదు కాదు కల్కి సినిమా అంతకుమించి అనే రేంజ్ లో తీశారు నాగ అశ్విన్. మరీ ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ .. ఆయన నటించిన తీరు పండించిన కామెడీ సినిమాకే హైలెట్ అవుతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ని మనం ఒక మల్టీ డిఫరెంట్ యాంగిల్ లో చూశామంటున్నారు. అటు నాటి బాయ్స్ కి.. ఇటు అమ్మాయిలకి నచ్చే విధంగా.. టెక్నాలజీ ఇష్టపడే వారికి.. పురాణాలను గౌరవించే పెద్దలకి అందరికీ నచ్చే పాత్రలో ప్రభాస్ కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనను ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here