Disha Patani : సినిమాల్లోకి రాకముందు ‘కల్కి’ హీరోయిన్ దిశా పటాని చేసిన పనులు ఏంటో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

- Advertisement -

Disha Patani : కొంతమంది హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నప్పటికీ వాళ్ళ అందానికి తగ్గ గుర్తింపు రాకపోవడాన్ని మనమంతా గమనిస్తూనే ఉన్నాము. అలాంటి హీరోయిన్ల క్యాటగిరీలోకి దిశా పటాని వస్తుంది. రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న ప్రభాస్ కల్కి చిత్రం లో ఈమె ఒక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ముందు తెలుగు లో ఆమె పూరీ జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లోఫర్’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె మొదటి చిత్రం. ఈ చిత్రం తర్వాత ఆమెకి బాలీవుడ్ లో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ లో హీరోయిన్ గా నటించింది.

THIS is why Disha Patani has been roped in to be the face of this international brand : Bollywood News - Bollywood Hungama

ఈ సినిమా భారీ హిట్ అవ్వడం తో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అయితే ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్ అయ్యినవే ఉన్నాయి. అందుకే ఆమె స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టలేకపోయింది. అయితే కల్కి సినిమా భారీ హిట్ అవ్వడం తో ఇక నుండి ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్తుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే దిశా పటాని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఒకసారి చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఆమె తండ్రి జగదీశ్ సింగ్ పటాని ఒక పోలీస్ అధికారి, అలాగే ఆమె తల్లి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్.

- Advertisement -

Disha Patani in celestial ivory silver lehenga stops traffic at ICW 2023. Wow pics - India Today

లక్ నౌ లోని అమితి యూనివర్సిటీ లో బీటెక్ రెండవ సంవత్సరం మధ్యలోనే ఆమె చదువు ఆపేసింది. సినిమాల్లోకి రాకముందు ఆమె ఆర్మీ లో జెట్ పైలెట్ గా దేశానికీ సేవలు అందించాలని కోరుకుందట. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేసిందట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెకి ఆ అదృష్టం దక్కకపోవడం తో మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టింది. 2013 వ సంవత్సరం కి గాను మిస్ ఇండియా రన్నరప్ గా నిల్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈమె డైరెక్టర్ పూరి జగన్నాథ్ దృష్టిలో పడడంతో లోఫర్ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. అక్కడి నుండి ఆమె కెరీర్ అనేక మలుపులు తిరిగి ఈ స్థాయికి చేరుకుంది.

Here's how Disha Patani keeps herself fit and in perfect shape | GQ India

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here