kalki first week collections రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘కల్కి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం ఎలాంటిదో ప్రతీ రోజు కళ్లారా చూస్తూనే ఉన్నాం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడం, కలెక్షన్స్ తెలుగు, హిందీ , తమిళం అని తేడా లేకుండా ఒక సునామి లాగ ఉండడం, ఇవన్నీ ట్రేడ్ కి కొత్త ఊపిరి ని పోసింది. ఎందుకంటే సంక్రాంతి సినిమాల తర్వాత కల్కి వరకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా డల్ గా ఉండేది. నైజాం ప్రాంతం లో థియేటర్స్ ని రన్ చేసుకోలేక కొంతకాలం మూసివెయ్యాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి స్థితి నుండి కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ కాసుల కనక వర్షం కురిపించడం తో బయ్యర్ల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇకపోతే ఈ సినిమా విడుదలై నేటితో వారం రోజులు పూర్తి చేసుకుంది.
ఈ వారం రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి వారం రిటర్న్ జీఎస్టీ తో కలిపి 67 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నిన్న కూడా ఈ ప్రాంతం లో ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఈమధ్య కాలం లో నైజం మార్కెట్ కేవలం వీకెండ్ వరకే పరిమితం అయ్యింది. ఆ తర్వాత సినిమాలు బాగా డౌన్ అవుతూ ఉండడం మనం గమనించాం. కానీ కల్కి చిత్రం మాత్రం ఇప్పటికీ అదే జోరుతో ముందుకు దూసుకుపోతుంది. ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అలాగే సీడెడ్ ప్రాంతం లో ఈ సినిమాకి 15 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర లో 15 కోట్ల 58 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 9 కోట్ల 22 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 6 కోట్ల 82 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 8 కోట్ల 48 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 8 కోట్ల 30 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగ, కర్ణాటక లో 22 కోట్ల రూపాయిలు, తమిళనాడు లో 14 కోట్ల రూపాయిలు, కేరళ లో 7 కోట్ల 25 లక్షల రూపాయిలు, హిందీ లో 80 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 85 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 343 కోట్ల రూపాయిల షేర్, 660 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం మొదటి వారం లోనే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కు కి ఈ చిత్రం కేవలం 28 కోట్ల రూపాయిల దూరంలో ఉంది.