kalki 2898 AD రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన కళ్లారా చూసాము. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో క్లీన్ హిట్ ఏదైనా ఉందా అంటే అది కల్కి చిత్రం మాత్రమే అని చెప్పొచ్చు. ఆయన గత చిత్రం ‘సలార్’ కమర్షియల్ గా బాగానే ఆడినప్పటికీ నూటికి నూరు శాతం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది. అందుకే కమర్షియల్ గా ఆ చిత్రం ఆయన కెరీర్ లో ఎబోవ్ యావరేజిగా నిల్చింది. ఇకపోతే నిన్నటితో ఈ చిత్రం ట్రేడ్ లెక్కల్లో కూడా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అధిగమించింది. వాస్తవానికి నిర్మాతలు ముందుగానే వెయ్యి కోట్లు రాకముందే పోస్టర్స్ పబ్లిసిటీ చేసారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.
కానీ ప్రభాస్ మాత్రం అదే పోస్టర్ ని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ నెంబర్ లేకుండా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి శబాష్ అనిపించాడు. ఇకపోతే ఈ చిత్రం విడుదలై నేటితో 25 రోజులు పూర్తి అయ్యింది. ఈ 25 రోజులకు గాను ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రభాస్ కి కంచుకోట గా పిలవబడే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 90 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే సీడెడ్ లో 21 కోట్లు, ఉత్తరాంధ్ర లో 21 కోట్ల 20 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 12 కోట్ల 30 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కోట్ల 20 లక్షలు, గుంటూరు మరియు కృష్ణ జిల్లాలలో చెరో 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టగా, నెల్లూరు 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 182 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే కర్ణాటక లో 35 కోట్లు, తమిళనాడు లో 21 కోట్ల రూపాయిలు, నార్త్ అమెరికా లో 18 మిలియన్ డాలర్లు, ఓవరాల్ ఓవర్సీస్ లో 130 కోట్ల రూపాయిలు, హిందీ లో 142 కోట్ల రూపాయిలు, కేరళలో 12 కోట్ల 50 లక్షలు వసూలు చేసింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 516 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను, అలాగే ఒక వెయ్యి 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆగష్టు 15 వరకు సినిమాలు పెద్దగా ఏమి లేవు కాబట్టి, అప్పటి వరకు రన్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.