కాజల్ అగర్వాల్.. రెండు దశాబ్దాలపాటు తెలుగు తెరపై రాణిస్తుంది. ఇంతటి సుధీర్ఘ కెరీర్ కొనసాగించడం అంత ఈజీ కాదు. తన పాజిటివ్ నేచర్, కంఫర్ట్ నేచర్‌తో రాణించగలుగుతుంది. అదే సమయంలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గానూ నిలుస్తుంది. ఈ బ్యూటీ సినిమాలు చాలా వరకు సక్సెస్ కావడం కూడా కాజల్ ఇంతటి లాంగ్ కెరీర్ కొనసాగించడానికి కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ జోరు మామూలుగా లేదు. రెండు పెద్ద సినిమాల్లో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏజ్‌లో, పైగా పెళ్లయ్యాక గ్లామర్ పాత్రలు చేయడం కష్టం కాబట్టి రూట్ మార్చి దూసుకెళ్తుంది.
ఇక అది అలా ఉంటే కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా నెటిజన్లతో ముచ్చటిస్తూ.. తను కూడా డిప్రెషన్‌కి గురయ్యానంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్‌గా మారాయి. డెలివరీ తర్వాత తాను డిప్రెషన్‌కి గురయ్యానని తెలిపింది. అయితే అది సర్వసాధారణ విషయమని పేర్కోంది. మహిళలు ఎవరైనా సరే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో బాధపడితే ఫ్యామిలీ అండగా నిలబడాలి. అలాగే ఆడవాళ్లు పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత టైం కేటాయించుకోవాలి. ఇష్టమైన వారితో సయమాన్ని గడపడం వంటివి చేయాలనీ తెలిపింది. ఇలాంటీ పనులు చేయడం వల్ల డిప్రెషన్ నుండి త్వరగా బయటపడొచ్చని తెలిపింది. ఆ సమయంలో తన భర్త ఎంతో అండగా ఉన్నాడని తెలిపింది.
అలాగే ఒక అభిమాని నన్ను పెళ్లి చేసుకుంటారా..?
అంటూ తుంటరి ప్రశ్న వేశాడు. అందుకు కాజల్ నో ఆ అదృష్టం లేదు, రెండున్నార ఏళ్ల క్రితమే అది మరొకరిని వరించింది అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ఒక నెటిజన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పమని కోరాడు. అందుకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ.. బన్నీ బెస్ట్ కోస్టార్ అని, తనకు తెలిసిన మంచి వ్యక్తులలో అతను కూడా ఒకరని కొనియాడింది. అలాగే బన్నీ ఎప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉంటాడని.. అతనిలో ఆ క్వాలిటీ అంటే తనకు చాలా ఇష్టమని కాజల్ పేర్కొంది. దీంతో కాజల్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. అల్లు అర్జున్, కాజల్ రెండు చిత్రాల్లో నటించించారు. అందులో ఆర్య 2 ఒకటి అయితే.. మరొకటి ఎవడు. రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.