Kajal Agarwal : కాజల్ అగర్వాల్ పేరు నా ముందు ఎత్తకు అంటూ యాంకర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఉపాసన!

- Advertisement -

Kajal Agarwal : మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆన్ స్క్రీన్ మీద రామ్ చరణ్ కి సరైన జోడి ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. వీళ్లిద్దరు కలిసి మొదటిసారిగా ‘మగధీర’ చిత్రం లో కలిసి నటించారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టై ఇద్దరినీ ఓవర్ నైట్ స్టార్స్ ని చేసింది. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘నాయక్’ అనే చిత్రం లో నటించారు. ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది.

Kajal Agarwal
Kajal Agarwal

ఆ తర్వాత వీళ్ళు కలిసి ‘ఎవడు’ , ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి సినిమాలు చేసారు. ఇలా కాజల్ అగర్వాల్ ని తన ప్రతీ సినిమాలో పెట్టుకుంటూ వచ్చేవాడు రామ్ చరణ్. ముఖ్యంగా ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం లో వీళ్లిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ హద్దులు దాటేసిందనే చెప్పొచ్చు. అవసరం లేని సన్నివేశాల్లో కూడా కాజల్ చేత ముద్దులు పెట్టించాడు డైరెక్టర్ కృష్ణ వంశీ.

ఈ సినిమా లో రొమాన్స్ విషయం లో అప్పట్లో రామ్ చరణ్ తో ఉపాసన పెద్ద గొడవ పెట్టుకుంది అని అందరూ అంటూ ఉంటారు. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని అనుకునేవాళ్లు కొంతమంది. కానీ అది రూమర్ కాదు నిజమే అని రీసెంట్ గా ఉపాసన కొణిదెల ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అర్థం అవుతుంది. యాంకర్ మాట్లాడుతూ ‘రామ్ చరణ్ పక్కన ఆన్ స్క్రీన్ మీద ఎవరు సరైన జోడి అని మీరు అనుకుంటున్నారు’ అని యాంకర్ అడుగుతుంది.

- Advertisement -

దానికి ఉపాసన సమాధానం చెప్తూ ‘మీరు చెప్పాలి అది, నేను ఎలా చెప్పగలను అంటుంది’. అప్పుడు యాంకర్ కాజల్ అగర్వాల్ పేరు చెప్పగా దానికి ఉపాసన సమాధానం చెప్తూ ‘ఎందుకు కైరా అద్వానీ కాకూడదు? ఎందుకు ప్రియాంక కాకూడదు?, ఎందుకు తమన్నా కాకూడదు’ అంటూ సమాధానం ఇచ్చింది. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఉపాసన కి కాజల్ అగర్వాల్ అంటే ఎంత ఇష్టం లేదు అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here