Kajal Aggarwal : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ అగర్వాల్ పేరు ముందు వరుస లో ఉంటుంది. కెరీర్ ప్రారంభం లో ఈమె చిన్న చిన్న సినిమాలతోనే నెట్టుకొచ్చింది. అలా కెరీర్ వెళ్తున్న సమయం ‘చందమామ’ చిత్రం తో మొదటిసారిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె చేసిన ‘మగధీర’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసింది.

కాజల్ అగర్వాల్ ని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ని చేసింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్, ఇప్పుడు ‘సత్యభామ’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నేడు విడుదల అయ్యింది. ఈ టీజర్ లో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఫైట్స్ చెయ్యడం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ, ఈ టీజర్ ని బాగా గమనిస్తే ‘ప్రజాసేన’ అనే పార్టీ కి సంబంధించిన బ్యానర్ ఒకటి కనిపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి సెటైర్ వేస్తూ చేసిందిగా భావిస్తున్నారు.

సోషల్ మీడియా లో ఇప్పటికే దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడడం ప్రారంభించారు. పార్టీ పేరుని మాత్రమే కాదు, పిడికిలి గుర్తు కూడా జనసేన పార్టీ ని ఉద్దేశించి పెట్టినట్టుగా అర్థం అవుతుంది. కాజల్ అగర్వాల్ ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తుంది?, ఆమె ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందా?, ఈ సినిమా డైరెక్టర్ కావాలని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడా అనేది చూడాలి.