సౌత్ ఇండియా లో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సమానమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న సినిమాలు చేసిన ఈమె, ‘చందమామ’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని, ఆ తర్వాత మగధీర సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రం తర్వాత కాజల్ అగర్వాల్ రేంజ్ ఎలా మారిందో మేము చెప్పడం ఎందుకు, ప్రతీ ఒక్కరికి తెలిసిందే.
కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ గురించి అందరికీ తెలుసు కానీ, ఆమె వ్యక్తిగత విషయం గురించి మాత్రం చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. ఈమెకి టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ మంచి స్నేహితులే, కానీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో మాత్రం ఆమె చాలా డీప్ రిలేషన్ ని మైంటైన్ చేసింది. వీళ్ళిద్దరూ కలిసి ‘డార్లింగ్’ మరియు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు.
అయితే డార్లింగ్ సినిమాకి ముందే ప్రభాస్ మరియు కాజల్ అగర్వాల్ చాలా డీప్ గా లవ్ చేసుకున్నారట. వీళ్లిద్దరి పరిచయం ఒక పబ్ లో జరిగిందట. ఆ పరిచయం కారణంగానే వీళ్లిద్దరు కలిసి డార్లింగ్ సినిమా చేసారు. అయితే వీళ్ళు రిలేషన్ లో ఉన్న సమయం లో ఇద్దరు బహుమతులు పంచుకునేవారట. ఆ సమయం లోనే కాజల్ అగర్వాల్ కి ప్రభాస్ ఒక అందమైన నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడట.
ఈ నెక్లెస్ ని ఆమె మగధీర సినిమా లో కూడా వాడుకుంది. మరో విషయం ఏమిటంటే మగధీర లో కాజల్ అగర్వాల్ ని రాజమౌళి కి రికమండ్ చేసింది కూడా ప్రభాస్ అట. ఆయన చెప్పబట్టే కాజల్ అగర్వాల్ కి స్క్రీన్ టెస్ట్ చేసి సినిమాలో తీసుకున్నారనీ అంటుంటారు. అయితే ప్రభాస్ ఇచ్చిన ఆ నెక్లెస్ విలువ రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని టాక్.