Kajal Aggarwal : ఎంత పెద్ద స్టార్ కి అయినా సినిమా ఇండస్ట్రీ లో కొన్ని చేదు జ్ఞాపకాలు మరియు అవమానాలు తప్పవు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో హీరోయిన్ల సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీళ్ళను కనీసం మనిషి లెక్క కూడా చూసేవాళ్ళు కాదు. అలాంటి ఘోరమైన అవమానాలు ఎదురుకున్న తర్వాత, టాలెంట్ కి తోడు కాలం కూడా కలిసి వచ్చి స్టార్స్ గా ఎదిగారు కొంతమంది.
అలాంటి వారిలో ఒకరు కాజల్ అగర్వాల్. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చిన కాజల్ అగర్వాల్, ఆ తర్వాత పెద్ద హీరోల సరసన అవకాశాలు సంపాదించి సౌత్ లో ఉన్నటువంటి అన్నీ ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఎన్నో క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని నేడు లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతుంది. అందం తో పాటు అద్భుతమైన అభినయం కాజల్ అగర్వాల్ సొంతం.
అందుకే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు కావొస్తున్నా కూడా ఆమెకి ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఎంత మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లో పుట్టుకొచ్చిన, కాజల్ అగర్వాల్ కి ఉన్న బ్రాండ్ ఇమేజి వేరు. అయితే కాజల్ అగర్వాల్ కెరీర్ ప్రారంభం లో ఒక స్టార్ డైరెక్టర్ పెట్టే టార్చర్ ని భరించలేక, షూటింగ్ స్పాట్ లోనే ఏడుస్తూ ‘ఇంతలా అవమానిస్తున్నావ్ నన్ను, నాశనం అయిపోతావ్’ అని అందరి ముందు తిట్టిందట.
ఎంత మంచి షాట్ వచ్చినా కూడా ఆ డైరెక్టర్ కాజల్ అగర్వాల్ చేత రీ టేకులు చేయించడం, కొట్టడం వంటివి చేసేవాడట. అవి భరించలేక ఆమె అలా అందరి ముందు శాపనార్దాలు పెట్టిందని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉండేది. ఆ డైరెక్టర్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు. కనీసం ఆయనతో ఇంటర్వ్యూ లు చేసే యూట్యూబ్ చానెల్స్ కూడా దొరకడం లేదట. కాజల్ అగర్వాల్ శాప ఫలితం ఈ రేంజ్ లో ఉంటుందా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.