Kajal Aggarwal : ఈ ఏడాది దసరా కానుకగా విడుదలైన సినిమాలలో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మనమంతా చూసాము. బాలయ్య నుండి ఇంత చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈమధ్య కాలం లో రాలేదని, అందుకే ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు అంటూ ప్రశంసల వర్షం కురిసింది.

అయితే ఈ సినిమాలో బాలయ్య తర్వాత ఆయనతో సమానంగా పేరు దక్కించుకుంది శ్రీలీల. బాలయ్య పెంపుడు కూతురిగా ‘విజ్జీ పాప’ పాత్రలో చాలా చక్కగా నటించింది ఈ హాట్ బ్యూటీ. కానీ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రకి మాత్రం ప్రాధాన్యతే లేకుండా పోయింది. అంత పెద్ద హీరోయిన్ కి ఇలాంటి రోల్ ఇవ్వడం ఏమాత్రం బాగాలేదు అంటూ రివ్యూస్ కూడా వచ్చాయి. దీనిపై కాజల్ అగర్వాల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

యాంకర్ కాజల్ అగర్వాల్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘రీసెంట్ గా మీరు నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. కానీ మీకు మాత్రం పెద్దగా పేరు రాలేదు. దీనికి మీరేమైనా ఫీల్ అయ్యారా?’ అని అడుగుతుంది. దానికి కాజల్ అగర్వాల్ సమాధానం చెప్తూ ‘అలాంటిదేమి లేదు, వాస్తవానికి నేను రీ ఎంట్రీ తర్వాత రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ లో నటించాలని అనుకోలేదు.
కానీ అనిల్ రావిపూడి మరియు బాలయ్య గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చెయ్యడం తో ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది. ఇది నా పర్ఫెక్ట్ కం బ్యాక్ సినిమా కాదు. నా అసలు సిసలు కం బ్యాక్ చిత్రం ‘సత్యభామ’. ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ అందరూ నన్ను ఈ సినిమాలో చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక నుండి నేను ఇలాంటి పాత్రలే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.