లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కాజల్. చందమామ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఆ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది. దశాబ్ధ కాలానికి పైగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్. గతేడాది పెళ్లి చేసుకుని ఈ మధ్యకాలంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అయినా కూడా అమ్మడి అందం చెక్కు చెదర లేదు. ఆమె అభిమానులు తన బ్యూటీ సీక్రెట్ గురించి ఎన్నో రకాలుగా ఆరా తీస్తున్నారు. కానీ తెలుసుకోలేకపోయారు. కానీ ఇటీవలే కాజల్ బ్యూటీ సీక్రెట్ తెలిసిపోయింది. ఏంటి కాజల్ అందానికి కారణం ఆమె పాటించే కఠినమైన డైట్, రెగ్యులర్ జిమ్ వంటివి కానే కాదు. పొద్దున నిద్రలేవగానే చిన్న పాటి ఎక్సరసైజులు చేసి.. ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్డు తింటుందట.

అలాగే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఒకొ జొన్న రొట్టేను కర్రీతో పాటు తీసుకుంటుందట. మధ్నాహ్నం భోజనంలో, రాత్రి డిన్నర్ లో కచ్చితంగా పప్పు ఉండాల్సిందే అట. నిత్యం రెండు పూటలా రైస్, పప్పు తింటుందట. పప్పు కాజల్ ఫేవరెట్ డిష్ అట. పన్నీర్ కూడా చాలా ఇష్టమట. ప్రోటీన్ షేక్స్, కొబ్బరి నీళ్లు రెగ్యులర్ గా తాగుతుంటుందట. అమ్మడు ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ ను దరిదాపుల్లోకి కూడా రానివ్వదట. నాన్ వెజ్ స్మెల్ కూడా కాజల్ అగర్వాల్ కు నచ్చదట. ఇక చీట్ మీల్ డే రోజు మాత్రం అమ్మ చేసే పరోటాలను కనీసం పదైనా లాగించేస్తానని కాజల్ తానే పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇక కెరీర్ విషయానికొస్తే.. బ్యూటీ చేతినిండా సినిమాలున్నాయి. ఈ బ్యూటీ ఇప్పుడు గాపులేకుండా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది. బాలకృష్ణ భగవంత్ కేసరి, కమల్ హాసన్ ఇండియన్ 2
తో పాటు సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజల్ నటిస్తోంది.
