Kajal Agarwal : నా భర్త అందులో చాలా వీక్ అంటూ కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Kajal Agarwal : సౌత్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా, సూపర్ స్టార్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది. యూత్, ఫ్యామిలీ , మాస్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆమెని ఎంతగానో ఇష్టపడతారు. అందుకే పెళ్లి తర్వాత కూడా ఆమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.

Kajal Agarwal
Kajal Agarwal

ఇన్ని రోజులు కేవలం హీరోల పక్కన రొమాన్స్ చేసే హీరోయిన్ గా ఇండస్ట్రీ లో కొనసాగిన కాజల్ అగర్వాల్, ఇక నుండి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తుంది అట. అందులో భాగంగానే ఆమె ఇప్పుడు ‘సత్యభామ’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఆమె ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

త్వరలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా గడుపుతుంది కాజల్ అగర్వాల్. అందులో భాగంగానే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. యాంకర్ కాజల్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘పెళ్లి జరిగి ఇన్ని రోజులు అయ్యింది కదా, మీ ఇద్దరిలో ఎవరు రొమాంటిక్’ అని అడుగుతుంది.

- Advertisement -

దానికి కాజల్ అగర్వాల్ సమాధానం చెప్తూ ‘కచ్చితంగా నేనే రొమాంటిక్..నా భర్త రొమాన్స్ లో చాలా వీక్’ అంటూ చెప్పుకొచ్చింది. భర్త గురించి పబ్లిక్ గా అలా చెప్పేలోపు అందరూ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత బాగా బోల్డ్ అయిపోయింది, బోల్డ్ గా మాట్లాడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here