Jyoti Rai : బుల్లితెర నటి జగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు.. ఈ సీరియల్ లో ఎంతో చక్కగా సంప్రదాయబద్ధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బుల్లితెర పై కంటే సోషల్ మీడియాలోనే తాను ఎక్కువ సంచలనాలను సృష్టించింది. సీరియల్స్ లో చాలా పద్ధతిగా కనిపించే ఈ క్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలు ఆరబోస్తూ.. రీల్ లైఫ్ రియల్ లైఫ్ కు అసలు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఈ నటి ఛాతీపై టాటూ వేయించుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిన్నటి వరకు ఆ వీడియో వైరల్‌గా మారింది. జ్యోతి రాయ్ 20 ఏళ్ల వయసులో పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత ఆమె కన్నడ స్టార్ డైరెక్టర్ సుక్కు పూర్వాజ్‌తో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తోందని వార్తలు వచ్చాయి. ఆమె తన పేరు పక్కన సుక్కు పూర్వాజ్ పేరును కూడా జోడించి, కొత్త ఇన్‌స్టాగ్రామ్ పేజీని సృష్టించింది. దీంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారనే వార్త వైరల్‌గా మారింది. అయితే తాజాగా జ్యోతిరాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌తో అదంతా నిజమని తేలిపోయింది. తాజాగా సుక్కు పూర్వాజ్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతిరాయ్ ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు.

మేమిద్దరం కలిసి ఏడాది అయింది.. అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా భావాలను వ్యక్తీకరించడానికి పదాలు సరిపోవు, కౌగిలింతలు, ప్రేమ, మద్దతు, సానుకూల ఆలోచనలు, ఓర్పు, విధేయత, శ్రద్ధకు చాలా ధన్యవాదాలు. నిన్ను భర్తగా పొందడం నా అదృష్టం. విష్ యు వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే హస్బెండ్ లవ్ యూ అని ఆ పోస్ట్ లో రాశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందన్న వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ పోస్ట్ వారికి పెళ్లయిందని స్పష్టం చేసింది. ఒకరినొకరు కలిసిన ఆరు నెలలకే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.