Jyothika : కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో జ్యోతిక ఒకరు. చంద్రముఖి సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆ ఒక్క సినిమా జ్యోతిక కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు తన హవా చాటింది. ప్రస్తుతం హీరో సూర్యను పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తుంది. చిత్ర పరిశ్రమలో సూర్య, జ్యోతిక జంటకి ఉన్న క్రేజ్ వేరు. ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. సూర్య ఒకవైపు స్టార్ హీరోగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక జ్యోతిక కూడా రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. జ్యోతిక లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది.

జ్యోతిక ఫిట్ నెస్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. తరచుగా జ్యోతిక జిమ్ వర్కౌట్స్ చేయడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అందుకే జ్యోతిక 45 ఏళ్ల వయసులో కూడా సాహసాలు చేయగలుగుతోంది. తాజాగా జ్యోతిక అనితర సాధ్యమైన సాహసాన్ని చేసి తన స్టామినా ఏంటో చూపించింది. ఆమె హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎవరెస్టు బేస్ క్యాంప్ కి చేరుకుంది. గతంలో జ్యోతిక కశ్మీర్ లో ట్రెక్కింగ్ చేసింది. ఇప్పుడు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని చేరుకుని తన ఖాతాలో మరో ఘనతను చేర్చుకుంది. తన జర్నీకి సంబంధించిన వీడియో జ్యోతిక షేర్ చేసింది. ఎవరెస్టు బేస్ క్యాంప్ 5000 పైగా మీటర్ల ఎత్తులో ఉంది.

అక్కడ ఉన్న చిన్న చిన్న హోటల్స్ లో బస చేయడం.. ఫుడ్ తినడం లాంటి మెమొరీస్ ని వీడియో రూపంలో అభిమానులతో షేర్ చేసుకుంది. దీనితో అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెస్టు బేస్ క్యాంప్ ని చేరుకున్న ఫస్ట్ హీరోయిన్ ఇండస్ట్రీలో బహుశా జ్యోతిక నే ఏమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతిక ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో జ్యోతిక, సూర్య కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్లు కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
View this post on Instagram