జ్యోతిక.. తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచతమైన పేరు. చంద్రముఖిగా దాదాపుగా భయపెట్టేసింది. ఆ పాత్రలో తన నటనకు వంక పెట్టడానకిి కూడా లేదు. నాన్ దా చంద్రముఖి.. లకలకలకలక అంటూ జ్యోతిక డైలాగ్ చెబుతుంటే.. ఆ సీన్ బిగ్ స్క్రీన్ పై చూస్తుంటే.. చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదనుకోండి. అలా టాలీవుడ్ ప్రేక్షకుల మదిని గెలుచుకున్న జ్యోతిక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

అయితే తమిళ్ హీరో సూర్యను వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకే తన టైం కేటాయించింది. ఆ తర్వాత పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనలో బిజీ అయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లవ్వడంతో జ్యోతిక తన ప్రొఫెషనల్ లైఫ్ ను రీస్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. దూసుకెళ్తోంది. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు చిత్రాల్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తోంది.
ఇక తాజాగా జ్యోతిక 69ల ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ ఈవెంట్ కు ఈ బ్యూటీ బ్లాక్ కలర్ సూట్ లో వచ్చింది. ఈ సూట్ లో జ్యోతిక బాస్ లేడీ వైబ్స్ ఇచ్చింది. ప్రస్తుతం జ్యోతిక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే జ్యోతిక లుక్ పై కొందరు నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
జ్యోతిక బ్లాక్ కలర్ సూట్ లో కనిపించగా.. ఈ సూట్ పైన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే ఈవెంట్ కు అచ్చం జ్యోతిక లాంటి ఔట్ ఫిట్ లోనే వైట్ కలర్ సూట్ లో కీర్తి సురేశ్ వచ్చింది. దీంతో ఇద్దరి డిజైనర్ ఒకరే ఉన్నట్టున్నారు.. రెండు ఔట్ ఫిట్స్ రెడీ చేస్తే చెరోటి ఇచ్చినట్టున్నారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.