Junior NTR : మరోసారి రోడ్డు ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్..కన్నీళ్లు పెట్టిస్తున్న లేటెస్ట్ ఫోటోలు!

- Advertisement -

Junior NTR : నందమూరి కుటుంబానికి యాక్సిడెంట్ గండం మామూలు రేంజ్ లో లేదు. 2009 ఎన్నికల ప్రచారం సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి ఒకసారి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. శరీరం మొత్తం రక్తపు మడుగులో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడి దీవెనెలు, అభిమానుల ప్రార్థనలతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ నందమూరి హరికృష్ణ, నందమూరి జానకిరామ్ మాత్రం రోడ్డు ప్రమాదం లో మరణించారు. ఇది ఎన్టీఆర్ ని, ఆయన అభిమానులని ఎంతో మానసిక వేదనకు గురి చేసింది. ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ మరోసారి రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సోషల్ మీడియా లో ఒక వార్త పెను దుమారం రేపింది. దీనిపై ఎన్టీఆర్ టీం కాసేపటి క్రితమే మీడియా కి అధికారికంగా తెలిపింది.

Junior NTR
Junior NTR

పూర్తి వివరాల్లోకి వెళ్తే కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా ఆయన చేతికి గాయమైందని, అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పాల్గొని ఆ చిత్రాన్ని పూర్తి చేసాడని, మిగిలిన షూటింగ్ కూడా మరో వారం రోజుల్లో పూర్తి అవుతుందని తెలిపారు. అయితే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా ఎన్టీఆర్ ఎలాంటి రోడ్డు ప్రమాదానికి గురి అవ్వలేదని, అభిమానులు దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మి కంగారు పడొద్దు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు కాస్త శాంతించారు, జిమ్ వర్కౌట్స్ లో జరిగిన గాయం నుండి తొందరగా బయటపడాలి అంటూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి ప్రార్థిస్తున్నారు. ఇకపోతే ఆయన కొరటాల శివతో చేస్తున్న దేవర సినిమా వచ్చే నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Image

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, గ్లిమ్స్ వీడియోలు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకొని సినిమా పై భారీ అంచనాలను పెరిగేలా చేసాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ‘ఆయుధ పూజా’ సాంగ్ ని కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు ఒక ఎత్తు, ఈ ఆయుధ పూజ అనే పాట మరో ఎత్తు, గత రెండు పాటలకంటే పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. వచ్చే వారం ఈ పాట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఈ వారంలోనే రాబోతుంది.

Jr NTR Devara: Jr NTR Says 'What A Wonderful Journey It Has Been', As He Wraps Up Shooting For Devara | Times Now

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here