Junior NTR : ప్రస్తుతం చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరూ తమ సినిమాల్లో హీరోయిన్ గా శ్రీలీల కావాలి అంటూ పట్టుబడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి సందడి చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా శ్రీలీల, రెండేళ్ల గ్యాప్ లో ఈ స్థాయికి చేరుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కేవలం ఈమె కోసమే టికెట్స్ తెంచే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.

అందుకే ఆమె కోసం నిర్మాతలు అంతలా పరితపిస్తున్నారు. రీసెంట్ గానే ‘భగవంత్ కేసరి’ చిత్రం లో అద్భుతమైన పాత్ర పోషించి మంచి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల, రాబొయ్యే ఆరు నెలల్లో ఆరు సినిమాల్లో మన అందరికీ కనిపించబోతుంది. ఈ స్థాయి డిమాండ్ ఉన్న హీరోయిన్ ని జూనియర్ ఎన్టీఆర్ కావాలనే రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.

అసలు విషయం లోకి వెళ్తే ‘దేవర’ చిత్రం లో సెకండ్ హీరోయిన్ రోల్ ఉంటుంది. ఈ పాత్ర కోసం పలువురి హీరోయిన్ల పేర్లను అనుకోని శ్రీలీల పేరు ని ఎన్టీఆర్ కి సజెస్ట్ చేసాడట డైరెక్టర్ కొరటాల శివ. కానీ ఎన్టీఆర్ మాత్రం శ్రీలీల కి నో చెప్పినట్టు తెలుస్తుంది. శ్రీలీల ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్, ఆమెకి యూత్ లో మంచి క్రేజ్ కూడా ఉంది.

ఈ రోల్ పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్. అలాంటి పాత్రలో శ్రీలీల ని చూపిస్తే మన సినిమా మీద ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకి ఆమె కరెక్ట్ కాదు అంటూ ఎన్టీఆర్ దేవర నుండి శ్రీలీల ని తప్పించాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం, ఏప్రిల్ 5 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
