నేడు పాన్ వరల్డ్ స్టార్ గా కీర్తి ప్రతిష్టలను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం మన మధ్య తరగతి కుటుంబం వాళ్లకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే మన తోటి స్నేహితులు కాసేపు మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి కలుగుతుంది.తాను ఒక పెద్ద మాస్ హీరో, పాన్ వరల్డ్ స్టార్ అనేవి కాసేపు మర్చిపోయి, ఎన్టీఆర్ చెప్పే కబుర్లను వింటూ ఉంటాము.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ చిన్నతనం నుండి అల్లరి వయసుకి మించి చేసేవాడని , అతని అల్లరి భరించలేకా తల్లి షాలిని చితకబాదేవారని, అలా ఆమె ఎన్ని సార్లు తనని కొట్టిందో లెక్కే లేదని ఎన్టీఆర్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు.అయితే నన్ను కొట్టిన తర్వాత ఆమె చాలా బాధపడేది అని, నేను చూడకుండా సైలెంట్ గా బయట కూర్చొని ఏడ్చేదాన్ని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

ఒక వయస్సులోకి వచ్చే వరకు నా అల్లరిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అయ్యేదని, కానీ నా పిల్లలిద్దరినీ మాత్రం నా భార్య లక్ష్మి చాలా పద్దతి గా పెంచుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో తెలిపాడు. ఇది ఇలా ఉండగా చిన్నప్పుడు ఆయన చేసిన ఎన్నో చిలిపి చేష్టలతో ఒక సంఘటన ని గుర్తు తెచ్చుకొని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

ఆయన మాట్లాడుతూ ‘మేము ఉంటున్న కాలనిలో ఒకరోజు మా ఇంట్లో ఉన్న బల్బ్ ని తీసుకెళ్లి ట్రాన్స్ ఫార్మర్ లో పెట్టాను, అది పేలిపోయింది. కరెంటు ఆఫీస్ వాళ్ళు దానిని రిపేర్ చెయ్యడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఆ రెండు రోజులు కాలనీ మొత్తం అంధకారం లోనే ఉండిపోయింది. ఈ విషయం నేనే చేసానని మా అమ్మకి తెలియదు, తెలిస్తే నన్ను కొట్టి చంపేసేది’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.