Uday Kiran : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకడు ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా, ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యి, చిత్రం సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు.
వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి యూత్ ఆడియన్స్ మరియు లేడీస్ ఫాలోయింగ్ లో స్టార్ హీరోలతో పోటీ ఇచ్చాడు. అయితే మధ్యలో కొన్ని స్క్రిప్ట్ సెలెక్షన్స్ సరిగా లేకపోవడం వల్ల దారుణమైన పరాజయాలను మూటగట్టుకొని మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ సినిమాలతో పోటీ పడి, వచ్చే కాస్త వసూళ్లకు కూడా గండి కొట్టుకున్నాడు ఉదయ్ కిరణ్. ఉదాహరణకి 2006 వ సంవత్సరం లో ఎన్టీఆర్ నుండి రాఖీ అనే చిత్రం విడుదలైంది.
సరిగ్గా ఈ సినిమా విడుదల సమయం లోనే ఉదయ్ కిరణ్ మరియు కె బాలచందర్ కాంబినేషన్ లో ‘అబద్దం’ అనే చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్ తో సినిమా విడుదల అనేలోపు ఉదయ్ కిరణ్ కి థియేటర్స్ కరువు అయ్యింది. దానికి తోడు ఆ చిత్రానికి డిజాస్టర్ ఫ్లాప్ టాక్ కూడా వచ్చింది. దీంతో కనీసం కోటి రూపాయిలను కూడా రాబట్టలేక వారం లోపే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది ఆ చిత్రం.
ఈ సినిమా తర్వాత ఆయన మరోసారి ఎన్టీఆర్ దమ్ము చిత్రం తో ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ చిత్రం తో పోటీ పడ్డాడు. ఉదయకిరణ్ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియలేదు. అంత పెద్ద ఫ్లాప్ అయ్యింది ఈ చిత్రం. ఇక ముచ్చటగా మూడవసారి జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘బాద్షా’ చిత్రం తో ఉదయకిరణ్ ‘శ్రీరామ్’ అనే సినిమాతో పోటీ పడ్డాడు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది, అలా మూడు సార్లు ఎన్టీఆర్ తో పోటీపడి తీవ్రంగా నష్టపోయాడు ఉదయ్ కిరణ్.