నందమూరి వారసుడు సీనియర్ ఎన్టీఆర్ పేరుతో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అని అనిపించుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ద్వారా ఫెమస్ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన కెరియర్ అతి చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యి, తనకు కావాల్సిన ప్రతీదీ తానే సంపాదించుకున్నాడు. కష్ట జీవి, మానవత్వం ఉన్న మనిషి జూనియర్ ఎన్టీఆర్.
అందుకే అభిమానులకు ఆయన అంటే ఎంతో ఇష్టం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ సంపాదన రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆయనకు మొదలైన క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. క్రేజ్ ఉన్నంత కాలం సినిమా రంగంలో డబ్బు వస్తూనే ఉంటాది. ఆ డబ్బుని ఎలా మనం జాగ్రత్త చేసుకుంటున్నాము, దాన్ని ఇంకా ఎలా పెంచుకుంటున్నాము అనేది ఎవరి తెలివి వాళ్లది. జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలు మాత్రమే కాకూండా, కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాన్డ్ అంబాసిడర్ గా కూడా పని చేస్తున్నారు. అలాగే టీవీ లైవ్ షో కి హోస్ట్ గా బిగ్ బాస్ లాంటి వాటికి చేసారు. ఇలా నిరంతరం బిజీగా ఉంటూ ఆనందంతో పాటు డబ్బుని కూడా సంపాదించుకుంటున్నారు.
తాజాగా సెలబ్రిటీ ఆస్తుల వివరాలను తెలిపే ఒక వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఇండియన్ రూపాయలలో రూ.500 కోట్లుగా ఉందట. ఇక నెలవారీగా ఆయన ఆదాయం సుమారుగా మూడు కోట్లకు మించి ఉంటుందని సమాచారం. ఈ వెబ్సైటు లో చూసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఎన్టీఆర్ కి అంత ఆస్తి ఉంటె కూడా, దానిని తన స్వయంకృషితో సంపాదించుకున్నదే అవుతుందని, తాతలు తండ్రులని నుంచి పేరుని తప్ప ఆస్తిని ఏమి వాళ్ల హీరో పొందలేదని ఎన్టీఆర్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.