టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో విడుదల అవ్వడంలేదా వారం రోజుల గ్యాప్ తో విడుదల అవ్వడం అనేది కొత్తేమి కాదు. దశాబ్దాల నుండి కొనసాగుతూ వస్తున్నదే అది. అప్పట్లో చిరంజీవి మరియు బాలకృష్ణ సంక్రాంతి పోరు లో నిలబడి ఒక్క రోజు గ్యాప్ తో విడుదల చేసారు. కొన్ని సార్లు బాలయ్య బాబు విజయం సాధిస్తే కొన్ని సార్లు మెగాస్టార్ చిరంజీవి విజయం సాధించింది.
ఇక నేటి తరం హీరోలలో మహేష్ బాబు మరియు రామ్ చరణ్ మధ్య ఎక్కువ సారళ్య పోటీ పడింది. వీళ్లిద్దరి చిత్రాలు ఒక్క రోజు తేడా విడుదలైనవి ఉన్నాయి. ఎక్కువ శాతం రామ్ చరణ్ విజయాలు అందుకున్నాడు. మరో పక్క పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా ఒకసారి బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో పవన్ కళ్యాణ్ ముందు తేలిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.
ఇక అసలు విషయం లోకి వెళ్తే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ 2006 వ సంవత్సరం లో కృష్ణవంశీ దర్శకత్వం లో ‘రాఖీ’ అనే చిత్రం చేసాడు. మంచి కంటెంట్ తో మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా , బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం మొదటి రోజు నుండే యావరేజి పెర్ఫార్మన్స్ ని దక్కించుకుంది. మెల్లగా పికప్ అవుతున్న సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘అన్నవరం’ చిత్రం విడుదలైంది.
ఈ సినిమాకి పెద్దగా టాక్ రాలేదు, యావరేజి నుండి బీలో యావరేజి వసూళ్లు టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా , ఓపెనింగ్స్ పరంగా ఈ చిత్రం వసూళ్ల సునామి సృష్టించింది అనే చెప్పాలి. ఎన్టీఆర్ రాఖీ చిత్రం వసూళ్లకు భారీ స్థాయిలో గండి కొట్టి, ఆరోజుల్లోనే ఈ చిత్రం 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. మరో పక్క పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న రాఖీ చిత్రం మాత్రం కేవలం 13 కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ అన్నవరం సినిమా విడుదల అవ్వకపోయ్యుంటే రాఖీ చిత్రం మరో మూడు కోట్లు ఎక్కువ వసూళ్లే రాబట్టేవి అని అనేవారు ట్రేడ్ పండితులు.