JR NTR : #RRR లాంటి సంచలన విజయం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. విరామం లేకుండా నాన్ స్టాప్ గా కొనసాగుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా ఒక గుడ్ న్యూస్ మంచి కిక్ ని ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈ నెల 20 వ తేదీ లోపు విడుదల చేయబోతున్నారని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ టీజర్ ఒక విజువల్ ఫీస్ట్ గా ఉండిపోతుందని చెప్పుకొచ్చారు.

ఈ టీజర్ ని ఎట్టిపరిస్థితిలో ‘సలార్’ మూవీ కి అటాచ్ చెయ్యాలి అనేది దేవర టీం ప్లాన్. అందుకు తగ్గట్టుగా టీజర్ కి తుది మెరుగులు దిద్దే పనిలో మూవీ టీం ఫుల్ బిజీ గా ఉంది. టీజర్ కట్ సిద్ధం గా ఉందని, గ్రాఫిక్స్ వర్క్ ఒక్కటి పెండింగ్ లో ఉందని, త్వరలోనే అది పూర్తి చేసి అప్డేట్ ఇస్తాము అంటూ ఆ చిత్ర నిర్మాత, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈరోజు ఆయన హీరో గా నటించిన ‘డెవిల్’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.

సలార్ కి కేవలం తెలుగు వెర్షన్ కి మాత్రమే కాదు, హిందీ వెర్షన్ , తమిళ వెర్షన్ మరియు కన్నడ వెర్షన్ కి కూడా దేవర మూవీ టీజర్ ని అటాచ్ చేయబోతున్నారట. వచ్చే ఏడాది విడుదల అవ్వబొయ్యే సినిమాకి ఇప్పటి నుండే ఏ రేంజ్ ప్రొమోషన్స్ ప్రారంభం అయ్యాయో మనం చూడొచ్చు. ఇక విడుదల దగ్గరకి వచ్చేలోపు ఎలా ఉంటుందో చూడాలి మరి.