Ramoji Rao : రామోజీరావు కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ చేసిన జూ.ఎన్టీఆర్

- Advertisement -

Ramoji Rao : రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బెడ్ కే పరిమితమయ్యారు. శనివారం ఉదయం 4గంటల 50నిమిషాలకు నానక్ రామ్ గూడ లోని స్టార్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం మూడుగంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. రాత్రికి ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటిలేటర్ మీదే ఉంచి చికిత్స అందిచారు. కానీ,రామోజీరావు తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తన పార్థివదేహాన్ని తరలించారు.

రామోజీ రావు మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ‘శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు పుడతారు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి నేను మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -

రామోజీ మృతి పట్ల స్పందించిన రాజమౌళి
రామోజీ రావు మృతి పట్ల టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఒక వ్యక్తి 50 సంవత్సరాల కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి జీవనోపాధి, నమ్మకాన్ని అందించాడు. రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వడమే మనం ఇవ్వగలిగే సరైన నివాళి’ అంటూ ట్వీట్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here