JR NTR : ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోలకు బడ్జెట్ లు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతున్నాయి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు కాబట్టి ఎంత పెద్ద బడ్జెట్ పెట్టినా కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే రీ కవర్ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు దివాలా తీసే స్థితిలో ఉన్నాయి. నిర్మాతలు అడిగినంత ఫ్యాన్సీ రేట్ కి డబ్బులు వెచ్చించే స్థితిలో లో ఇప్పుడు ఓటీటీ సంస్థలు లేవట.
దీంతో ఇప్పుడు మేకర్స్ స్టార్ హీరోల సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టేందుకు భయపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల బుడ్జెట్స్ మొత్తం ఇప్పుడు మేకర్స్ ని కంగారు పెడుతుంది. టాక్ బాగుంటే వసూళ్లు చాలా తేలికగా వస్తున్నాయి. కానీ టాక్ లేనప్పుడు మాత్రం కనీసం మూడు రోజులు కూడా థియేటర్స్ లో నడిచే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు.
దాంతో పాటుగా ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా షాక్ ఇవ్వడం తో ఎన్టీఆర్ మేకర్స్ భయపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఈ చిత్రం తర్వాత ఆయన హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2 ‘ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 500 కోట్ల రూపాయిలు ఉంటాయట.
ఈ రెండు సినిమాలు తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 400 కోట్ల రూపాయిలు ఉంటుందట. ఇలా మూడు సినిమాలకు కలిపి దాదాపుగా 1200 కోట్ల రూపాయిలు ఎన్టీఆర్ కోసం ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ప్రభాస్ తర్వాత మన టాలీవుడ్ నుండి అంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నది ఎన్టీఆర్ మాత్రమేనట.