JR NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనకి తెలియని విషయం అంటూ ఏది లేదు, అతను సినిమాల్లోకి ఎలా వచ్చాడో, ఎంత కష్టపడితే నేడు ఆయన ఈ స్థానం లో ఉన్నాడో, ఇలాంటివి అన్నీ మనకి తెలుసు.కానీ ఆయన బాల్యం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా కొట్టేది అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు.
ఇక ఆ తర్వాత చిన్నప్పుడు ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామారావు ఆయనని ఎలా చేరదీసాడో, ఎంత ప్రేమ కురిపించాడో, తనకి ఆయన పేరు ని ఎలా పెట్టాడో, ఇలాంటివన్నీ చెప్పొచ్చాడు.కానీ ఎన్టీఆర్ బాల్యం గురించి మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా చదువుకోలేదు, ఆయన చదుకునే వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి పెద్ద మాస్ హీరో గా ఎదిగాడు, అంత చిన్న వయస్సు లో అంత మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరో ఇండియా లోనే లేడని చెప్పొచ్చు.
2001 వ సంవత్సరం లో ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ అనే సినిమా తో వెండితెర అరంగేట్రం చేస్తే 2003 వ సంవత్సరం ‘సింహాద్రి’ చిత్రం తో తిరుగులేని మాస్ హీరో గా ఎదిగాడు.ఇలా ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే ఎన్టీఆర్ కి ఆ రేంజ్ స్టార్ స్టేటస్ వచ్చేసింది.ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ గుంటూరు లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో చాలా చిలిపి వేషాలు వేసేవాడట, క్లాస్ లో పాఠాలు సరిగా వినేవాడు కాదట.
దొంగచాటున కాలేజీ గోడ దూకి సినిమాలకు వెళ్లడం, కాసేపు అమ్మాయిలకు బీట్ కొట్టడం వంటివి చేసేవాడట. ఎన్టీఆర్ అల్లరి ని తట్టుకోలేకపోతున్నాం అంటూ లెక్చరర్స్ కాలేజీ హెడ్ మాస్టర్ కి కంప్లైంట్ చేస్తే, ఆయన ఎన్టీఆర్ ని బాగా కొట్టాడట.ఇదంతా నేడు ట్విట్టర్ లో ప్రచారం అవుతున్న ఒక వార్త, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఎన్టీఆర్ కూడా మనలాంటి స్టూడెంట్, సరదాగా చిలిపి వేషాలు వేసాడు అని అభిమానులు మురిసిపోతున్నారు.