Jr NTR : నా కొడుకు కొడుతున్నాడు సార్.. డైరెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఎన్టీఆర్

- Advertisement -

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. ఆయన డ్యాన్సులు, యాక్షన్ కు ఫిదా కాని వాళ్లు ఉండరు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన దేవర టైటిల్ సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Jr NTR
Jr NTR

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ ముందు తన గోడు వెళ్లబోసుకున్నారట. తన కొడుకు తనను ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడని వాపోయాడట. అసలు విషయంలోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్, ప్రణతీలకు ఇద్దరు కొడుకులు అన్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరు అభయ్ రామ్, భార్గవ్ రామ్. అయితే వీరి గురించి ఎన్టీఆర్ చెప్తూ తన కొడుకు అభయ్ రామ్ తన లాగే చాలా సౌమ్యుడని చెప్పాడు. అలాగే తన కొంటె పనులు కూడా ఆయనకే వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంల జెమినీ టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఒక ఎపిసోడ్ కు దీనికి కొరటాల శివ, రాజమౌళి గెస్ట్ గా హాజరు అయ్యారు.

- Advertisement -

అయితే వారితో తన ఇద్దరు కొడుకుల గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దర్శకులతో మాట్లాడుతూ.. అభయ్ నాలాగే సౌమ్యుడు, నాలానే కొంటె పనులు కూడా చేస్తున్నాడు. ఒక రోజు నేను మంచి నిద్రలో ఉన్నాను. వాళ్లు సడెన్‌గా వచ్చి పడేల్ మని కొట్టి పారిపోయారు. ఇద్దరిలో ఎవరా అని ఎంక్వైరీ చేయగా అభయ్ గాడని తెలిసింది. అభయ్ రామే ఇది చేస్తాడని కొరటాల అన్నారు, అవును అభయే అంటూ తారక్ చెప్పారు. అభయ్ చాలా సౌమ్యుడు, కానీ ఇలాంటి పనులు కూడా చేస్తాడు. ఇక భార్గవ్ ప్రణతిలా కాస్త హైపర్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here